Annamayya Keerthanas Okapari Kokapari
అన్నమయ్య కీర్తన ఒకపరి కొకపరి
Annamayya Keerthanas Okapari Kokapari
అన్నమయ్య కీర్తన ఒకపరి కొకపరి
శ్లోక 1
రాగం: ఖరహరప్రియ
(పెద తిరుమలాచర్యుల రచన)
22 ఖరహరప్రియ మేల
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
తాలం: ఆది
పల్లవి
ఒకపరి కొకపరి కొయ్యారమై ।
మొకమున కలలెల్ల మొలచినట్లుణ్డె ॥
చరణం 1
జగదేకపతిమేన చల్లిన కర్పూరధూలి ।
జిగికొని నలువఙ్క చిన్దగాను ।
మొగి చన్ద్రముఖి నురమున నిలిపెగాన ।
పొగరు వెన్నెల దిగబోసి నట్లుణ్డె ॥
ఒకపరి కొకపరి కొయ్యారమై (ప..)
చరణం 2
పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు ।
కరగి ఇరుదెసల కారగాను ।
కరిగమన విభుడు గనుక మోహమదము ।
తొరిగి సామజసిరి తొలికినట్లుణ్డె ॥
చరణం 3
మెరయ శ్రీవేఙ్కటేశుమేన సిఙ్గారముగాను ।
తరచైన సొమ్ములు ధరియిఞ్చగా ।
మెరుగు బోడి అలమేలు మఙ్గయు తాను ।
మెరుపు మేఘము గూడి మెరసినట్లుణ్డె ॥
ఒకపరి కొకపరి కొయ్యారమై।
మొకమున కలలెల్ల మొలచినట్లుణ్డె ॥
