Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Podagantimayaa

అన్నమయ్య కీర్తన పొడగణ్టిమయ్య

Annamayya Keerthanas Podagantimayaa

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన పొడగణ్టిమయ్య

శ్లోక 1

రాగం:అట్టతాలం

పొడగణ్టిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము

నెడయకవయ్య కోనేటి రాయడా ॥

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల

నేరిచి పెద్దలిచ్చిన నిధానమా ।

గారవిఞ్చి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు

చేరువజిత్తములోని శ్రీనివాసుడా ॥

భావిమ్ప గైవసమైన పారిజాతమా, మమ్ము

చేవదేర గాచినట్టి చిన్తామణీ ।

కావిఞ్చి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము

తావై రక్షిఞ్చేటి ధరణీధరా ॥

చెడనీక బ్రతికిఞ్చే సిద్ధమన్త్రమా, రోగా

లడచి రక్షిఞ్చే దివ్యౌషధమా ।

బడిబాయక తిరిగే ప్రాణబన్ధుడా, మమ్ము

గడియిఞ్చినట్టి శ్రీ వేఙ్కటనాథుడా ॥