Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Nigama Nigamaanta Varnita

అన్నమయ్య కీర్తన నిగమ నిగమాన్త వర్ణిత

Annamayya Keerthanas Nigama Nigamaanta Varnita

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన నిగమ నిగమాన్త వర్ణిత

శ్లోక 1

నిగమనిగమాన్తవర్ణిత మనోహర రూప-

నగరాజధరుడ శ్రీనారయణా ॥

దీపిఞ్చు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య-

నోపకరా నన్ను నొడబరపుచు ।

పైపైనె సంసారబన్ధముల గట్టేవు

నాపలుకు చెల్లునా నారాయణా ॥

చికాకుపడిన నా చిత్తశాన్తము సేయ-

లేకకా నీవు బహులీల నన్ను ।

కాకుసేసెదవు బహుకర్మల బడువారు

నాకొలదివారలా నారాయణా ॥

వివివిధ నిర్బన్ధముల వెడలద్రోయక నన్ను

భవసాగరముల నడబడ జేతురా ।

దివిజేన్ద్రవన్ద్య శ్రీ తిరువేఙ్కటాద్రీశ

నవనీత చోర శ్రీనారాయణా ॥