Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Jo Achyutananda

అన్నమయ్య కీర్తన జో అచ్యుతానన్ద

Annamayya Keerthanas Jo Achyutananda

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన జో అచ్యుతానన్ద

శ్లోక 1

రాగం: కాపి

ఆ: స రి2 మ1 ప ని3 స

అవ: స ని2 ద2 ని2 ప మ1 గ2 రి2 స

తాలం: ఆది

పల్లవి

(రాగం: కేదార)

జో అచ్యుతానన్ద జోజో ముకున్దా

రావె పరమానన్ద రామ గోవిన్దా ॥ (2.5)

జో జో (2)

చరణం 1

అఙ్గజుని గన్న మా యన్న యిటు రారా

బఙ్గారు గిన్నెలో పాలు పోసేరా । (2)

దొఙ్గ నీవని సతులు గొఙ్కుచున్నారా

ముఙ్గిట నాడరా మోహనాకార ॥ (1)

జో జో ॥ (2)

చరణం 2

(రాగం: సురటి)

ఆ: స గ3 రి2 గ3 మ1 ప ద2 ని2 ద2 ప స

అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స

గోవర్ధనమ్బెల్ల గొడుగుగా పట్టి

కావరమ్మున నున్న కంసుపడగొట్టి ।

నీవు మధురాపురము నేలచేపట్టి

ఠీవితో నేలిన దేవకీపట్టి ॥

చరణం 3

నన్దు నిణ్టను జేరి నయము మీఱఙ్గ

చన్ద్రవదనలు నీకు సేవ చేయఙ్గ ।

నన్దముగ వారిణ్డ్ల నాడుచుణ్డఙ్గ

మన్దలకు దొఙ్గ మా ముద్దురఙ్గ ॥

చరణం 4

(రాగం: బిలహరి)

ఆ: స రి2 గ3 ప ద2 స

అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స

పాలవారాశిలో పవలిఞ్చినావు

బాలుగా మునుల కభయమిచ్చినావు ।

మేలుగా వసుదేవు కుదయిఞ్చినావు

బాలుడై యుణ్డి గోపాలుడైనావు ॥

చరణం 5

(రాగం: ధన్యాసి)

ఆ: స గ2 మ1 ప ని2 స

అవ: స ని2 ద1 ప మ1 గ2 రి1 స

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే

పట్టి కోడలు మూతిపై రాసినాడే ।

అట్టె తినెనని యత్త యడగ విన్నాడే

గట్టిగా నిది దొఙ్గ కొట్టుమన్నాడే ॥

చరణం 6

(రాగం: శన్కరాభరణ)

ఆ: స రి2 గ3 మ1 ప ద2 ని3 స

అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స

గొల్లవారిణ్డ్లకు గొబ్బునకుబోయి

కొల్లలుగా త్రావి కుణ్డలను నేయి ।

చెల్లునా మగనాణ్డ్ర జెలిగి యీశాయీ

చిల్లతనములు సేయ జెల్లునటవోయి ॥

చరణం 7

(రాగం: ఖరహరప్రియా)

ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స

అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స

రేపల్లె సతులెల్ల గోపమ్బుతోను

గోపమ్మ మీ కొడుకు మా యిణ్డ్ల లోను ।

మాపుగానే వచ్చి మా మానములను

నీ పాపడే చెఱిచె నేమన్దుమమ్మ ॥

చరణం 8

(రాగం: కామ్భోజి)

ఆ: స రి2 గ3 మ1 ప ద2 స

అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స ని3 ప ద2 స

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి

జగడములు కలిపిఞ్చి సతిపతులబట్టి ।

పగలు నలుజాములును బాలుడై నట్టి

మగనాణ్డ్ర చేపట్టి మదనుడై నట్టి ॥

చరణం 9

అలిగి తృణావర్తు నవని గూల్చితివి

బలిమిమై బూతన బట్టి పీల్చితివి ।

చెలగి శకటాసురుని జేరి డొల్చితివి

తలచి మద్దులు రెణ్డు ధరణి వ్రాల్చితివి ॥

చరణం 10

(రాగం: సురటి)

ఆ: స రి2 మ1 ప ని2 స

అవ: స ని2 ద2 ప మ1 గ3 ప మ1 రి2 స

హఙ్గుగా తాల్లపాకన్నయ్య చాల

శృఙ్గార రచనగా చెప్పె నీ జోల । (2)

సఙ్గతిగ సకల సమ్పదల నీవేల

మఙ్గలము తిరుపట్ల మదనగోపాల ॥ (1)

జో అచ్యుతానన్ద జోజో ముకున్దా

రావె పరమానన్ద రామ గోవిన్దా ॥ (ప.) (2.5)

జో జో ॥ (4)