Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Itti Muddulaadu

అన్నమయ్య కీర్తన ఇట్టి ముద్దులాడు

Annamayya Keerthanas Itti Muddulaadu

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన ఇట్టి ముద్దులాడు

శ్లోక 1

రాగం: దేవగాన్ధారి /ఆనన్దభైరవి

ఆ: స గ2 రి2 గ2 మ1 ప ద2 ప ని2 స

అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స

తాలం: త్/ఏక

పల్లవి

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు

వాని బట్టి తెచ్చి పొట్టనిణ్డ బాలు వోయరే ॥ (2)

చరణం 1

గామిడై పారితెఞ్చి కాగెడి వెన్నెలలోన

చేమ పూవు కడియాల చేయి పెట్టి । (2)

చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార

వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే ॥ (2)

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు .. (ఫా..)

చరణం 2

ముచ్చువలె వచ్చి తన ముఙ్గ మురువుల చేయి

తచ్చెడి పెరుగులోన దగబెట్టి । (2)

నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార

వొచ్చెలి వాపోవువాని నూరడిఞ్చరే ॥ (2)

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు .. (ఫా..)

చరణం 3

ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని

చెప్పరాని వుఙ్గరాల చేయి పెట్టి । (2)

అప్పడైన వేఙ్కటాద్రి అసవాలకుడు గాన

తప్పకుణ్డ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే ॥ (2)

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు

వాని బట్టి తెచ్చి పొట్టనిణ్డ బాలు వోయరే ॥ (2) (ఫా..)