Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Chakkani Talliki

అన్నమయ్య కీర్తన చక్కని తల్లికి

Annamayya Keerthanas Chakkani Talliki

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన చక్కని తల్లికి

శ్లోక 1

రాగం: హంసధ్వని / పాడి

ఆ: స రి1 మ1 ప ని3 స

అవ: స ని3 ప ద1 ప మ1 రి1 స

తాలం: ఆది

పల్లవి

చక్కని తల్లికి చాఙ్గుభలా

తన చక్కెర మోవికి చాఙ్గుభలా ॥ (2.5)

చరణం 1

కులికెడి మురిపెపు కుమ్మరిమ్పు తన

సలుపు జూపులకు చాఙ్గుభలా । (2)

పలుకుల సొమ్పుల బతితో గసరెడి

చలముల యలుకకు చాఙ్గుభలా ॥ (2)

చక్కని తల్లికి చాఙ్గుభలా (ప..)

చరణం 2

కిన్నెరతో పతి కెలన నిలుచు తన

చన్ను మెఱుగులకు చాఙ్గుభలా । (2)

ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన

సన్నపు నడిమికి చాఙ్గుభలా ॥ (2)

చక్కని తల్లికి చాఙ్గుభలా (ప..)

చరణం 3

జన్దెపు ముత్యపు సరులహారముల

చన్దన గన్ధికి చాఙ్గుభలా । (2)

విన్దయి వెఙ్కట విభుబెన చినతన

సన్ది దణ్డలకు చాఙ్గుభలా ॥ (2) క్ష్

చక్కని తల్లికి చాఙ్గుభలా (ప..)