Mantra - Sacred Scripture in telugu

Taraka Mantramu

తారక మన్త్రము

Taraka Mantramu

Mantra
Unknown
3 Verses
110%

తారక మన్త్రము

శ్లోక 1

రాగమ్: ధన్యాసి

తాలమ్: ఆది

తారక మన్త్రము కోరిన దొరికెను

ధన్యుడనైతిని ఓరన్నా ॥ పల్లవి ॥

మీరిన కాలుని దూతలపాలిటి

మృత్యువుయని మదినమ్ముక యున్న ॥ అనుపల్లవి ॥ తారక మన్త్రము ॥

మచ్చికతో నితరాన్తరమ్ముల మాయలలో పడబోకన్నా

హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా

ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా

వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు

శ్లోక 2

॥ 1 ॥ తారక మన్త్రము ॥

ఎన్నిజన్మములనుణ్డి చూచినను ఏకోనారాయణుడన్న

అన్ని రూపులై యున్న నాపరాత్పరు నామహాత్ముని కథ విన్నా

ఎన్ని జన్మములజేసిన పాపములీ జన్మముతో విడునన్నా

అన్నిటికిది కడసారి జన్మము సత్యమ్బిక పుట్టుట సున్నా

శ్లోక 3

॥ 2 ॥ తారక మన్త్రము ॥

నిర్మల మన్తర్లక్ష్యభావమున నిత్యానన్దముతోనున్న

కర్మమ్బులువిడి మోక్షపద్ధతిని కన్నుల నే జూచుచునున్న

ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్న

మర్మము దెలిసిన రామదాసుని హృన్మన్దిరముననే యున్న

శ్లోక 4

॥ 3 ॥ తారక మన్త్రము ॥