Carnatic Music Svarajathi 1 (Rara Venu Gopa Bala)
కర్ణాటక సఙ్గీతం స్వరజతి 1 (రార వేణు గోప బాలా)
Carnatic Music Svarajathi 1 (Rara Venu Gopa Bala)
కర్ణాటక సఙ్గీతం స్వరజతి 1 (రార వేణు గోప బాలా)
శ్లోక 1
రాగమ్: బిలహరి (మేలకర్త 29, ధీర శఙ్కరాభరణం జన్యరాగ)
స్వర స్థానాః: షడ్జమ్, శుద్ధ ఋషభమ్, శుద్ధ మధ్యమమ్, పఞ్చమమ్, శుద్ధ ధైవతమ్
ఆరోహణ: స . రి2 . గ3 . . ప . ద2 . . స'
అవరోహణ: స' ని3 . ద2 . ప . మ1 గ3 . రి2 . స
తాలమ్: చతురస్ర జాతి త్రిపుట (ఆది) తాలమ్
అఙ్గాః: 1 లఘు (4 కాల) + 1 ధృతమ్ (2 కాల) + 1 ధృతమ్ (2 కాల)
రూపకర్త: పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
భాషా: తెలుగు
సాహిత్యమ్
పల్లవి
రార వేణు గోపబాల రాజిత సద్గుణ జయశీల
అనుపల్లవి
సారసాక్ష నేరమేమి మరుబాధ కోర్వలేరా
చరణం 1
నన్దగోపాలా నే నెన్దు పోజాలా నీ
విన్దు రారా సదమలమదితో ముదమలరగ నాకెదురుగ గదియరా
(రార వేణు)
చరణం 2
పలుమారును గారవమున నిన్ పిలచిన పలుకవు నలుగకురా
కరివరద! మరిమరి నా యధరము గ్రోలరా కనికరముగ
(రార వేణు)
చరణం 3
రా నగధర రా మురహర రా భవహర రావేరా
ఈ మగువను ఈ లలలను ఈ సొగసిని చేకోరా
కోరికలిమ్పొన్ద డెన్దము నీయన్దు చేరెను నీ చెన్-
త మరువకురా కరములచే మరిమరి నిను శరణనెదర
(రార వేణు)
స్వరాః
పల్లవి
స , , రి । గ , ప , । ద , స' , । ని , ద , ।
రా--ర।వే-ణు-।గో-ప-।బా-లా-।
ప , ద ప । మ గ రి స । రి స ని@ ద@ । స , , , ॥
రా-జిత।సద్-గుణ।జయశీ-।లా---॥
స , , రి । గ , ప , । మ , , గ । ప , ద , ।
సా--ర।సా-క్ష-।నే--ర।మే-మి-।
రి' , , స' । ని , ద , । ప , , మ । గ , రి , ॥
మ--రు।బా-ధ-।కో--ర్వ।లే--రా॥
చరణం 1
స , , రి । గ , గ , । గ , , , । , , రి గ ।
నన్--ద।గో-పా-।లా---।--నే-।
ప , , ప । ప , ప , । ప , , , । , , ద ప ॥
నెన్--దు।పో-జా-।లా---।--నీ-॥
స' , , స' । స' , స' , । గ' రి' స' ని । ని ద ప , ।
విన్--దు।రా-రా-।సదమల।మదితో-।
ప ద ప మ । గ రి రి , । గ ప మ గ । రి స రి గ ॥
ముదమల।రగనా-।కెదురుగ।గదియరా॥
(రార వేణు)
చరణం 2
ప ప ప , । రి రి రి , । గ ప మ గ । గ , , , ।
పలుమా-।రునుగా-।రవమున।నిన్---।
గ ప మ గ । మ గ రి స । రి గ రి స । స , , , ॥
పిలచిన।పలుకవు।నలుగకు।రా---॥
రి స ని@ ద@ । స , , , । మ గ రి గ । ప , , , ।
కరివర।దా---।మరిమరి।నా---।
ద ప ద రి' । స' , , , । రి' స' ని ద । ప మ గ రి ॥
యధరము।గ్రో---।లరాకని।కరముగ॥
(రార వేణు)
చరణం 3
ప , , , । మ గ రి గ । ద , , , । మ గ రి గ ।
రా---।నగధర।రా---।మురహర।
ప , , , । మ గ రి గ । ప , ప , । ప , , , ॥
రా---।భవహర।రా-వే-।రా---॥
గ' , , , । రి' స' ని ద । రి' , , , । రి' స' ని ద ।
ఈ---।మగువను।ఈ---।లలనను।
స' , , , । రి' స' ని ద । స' , స' , । స' , , , ॥
ఈ---।సొగసిని।చే-కో-।రా---॥
గ' , రి' స' । రి' , రి' , । రి' , , , । రి' , స' ని ।
కో-రిక।లిమ్-పొన్-।ద---।డెన్-దము।
ద , ద , । ద , , , । ప , మ గ । గ , గ , ॥
నీ-యన్-।దు---।జే-రెను।నీ-చెన్-॥
గ , , , । స రి గ ద । ప , , , । రి' స' రి' గ' ।
త---।మరువకు।రా---।కరముల।
స' , , , । గ' రి' స' ని । ద ప మ గ । రి స రి గ ॥
చే---।మరిమరి।నినుశర।ణనెదర॥
(రార వేణు)
