Annamayya Keerthanas Muddugaare Yasoda
అన్నమయ్య కీర్తన ముద్దుగారే యశోద
Annamayya Keerthanas Muddugaare Yasoda
అన్నమయ్య కీర్తన ముద్దుగారే యశోద
శ్లోక 1
రాగం: సారన్గనాట
ఆ: స రి1 మ1 ప ద1 స
అవ: స ని3 స ద1 ప మ1 గ3 రి1 స
తాలం: ఆది
పల్లవి
ముద్దుగారే యశోద ముఙ్గిటి ముత్యము వీడు ।
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ॥ (2)
చరణం 1
అన్త నిన్త గొల్లెతల అరచేతి మాణిక్యము ।
పన్త మాడే కంసుని పాలి వజ్రము ।
కాన్తుల మూడు లోకాల గరుడ పచ్చ బూస ।
చెన్తల మాలో నున్న చిన్ని కృష్ణుడు ॥
ముద్దుగారే యశోద ముఙ్గిటి ముత్యము వీడు..(ప..)
చరణం 1
రతికేలి రుక్మిణికి రఙ్గు మోవి పగడము ।
మితి గోవర్ధనపు గోమేధికము ।
సతమై శఙ్ఖ చక్రాల సన్దుల వైడూర్యము ।
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ॥
ముద్దుగారే యశోద ముఙ్గిటి ముత్యము వీడు..(ప..)
చరణం 2
కాలిఙ్గుని తలలపై గప్పిన పుష్యరాగము ।
యేలేటి శ్రీ వేఙ్కటాద్రి యిన్ద్రనీలము ।
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము ।
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు ॥
ముద్దుగారే యశోద ముఙ్గిటి ముత్యము వీడు..(ప..)
