Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Maccha Kurma Varaha

అన్నమయ్య కీర్తన మచ్చ కూర్మ వరాహ

Annamayya Keerthanas Maccha Kurma Varaha

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన మచ్చ కూర్మ వరాహ

శ్లోక 1

మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా

యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ ॥

నన్నుగావు కేశవ నారాయణ మాధవ

మన్నిఞ్చు గోవిన్ద విష్ణు మధుసూదన ।

వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా

సన్నుతిఞ్చే హృషికేశ సారకు పద్మనాభ ॥

కణ్టిమి దామోదర సఙ్కర్షణ వాసుదేవ

అణ్టేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా ।

తొణ్టే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా

జణ్టవాయుకు మచ్యుత జనార్దన ॥

మొక్కేము వుపేన్ద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ

యెక్కితి శ్రీవేఙ్కట మిన్దిరానాథ ।

యిక్కువ నీ నామములు యివియే నా జపములు

చక్కగా నీ దాసులము సర్వేశ అనన్త ॥