Annamayya Keerthanas Garuda Gamana Garudadhvaja
అన్నమయ్య కీర్తన గరుడ గమన గరుడధ్వజ
Annamayya Keerthanas Garuda Gamana Garudadhvaja
Stotram
Unknown
0 Verses
110%
అన్నమయ్య కీర్తన గరుడ గమన గరుడధ్వజ
శ్లోక 1
రాగం: హిన్దోలమ్ (20 నటభైరవి జన్య)
ఆ: స గ2 మ1 ద1 ని2 స
అవ: స ని2 ద1 మ1 గ2 స
తాలం: రూపకమ్
పల్లవి
గరుడ గమన గరుడధ్వజ
నరహరి నమోనమో నమో ॥
చరణం 1
కమలాపతి కమలనాభా
కమలజ జన్మకారణిక । (2)
కమలనయన కమలాప్తకుల
నమోనమో హరి నమో నమో ॥ (2)
గరుడ గమన గరుడధ్వజ .. (ప..)
చరణం 2
జలధి బన్ధన జలధిశయన
జలనిధి మధ్య జన్తుకల । (2)
జలధిజామాత జలధిగమ్భీర
హలధర నమో హరి నమో ॥ (2)
గరుడ గమన గరుడధ్వజ .. (ప..)
చరణం 3
ఘనదివ్యరూప ఘనమహిమాఙ్క
ఘనఘనా ఘనకాయ వర్ణ । (2)
అనఘ శ్రీవేఙ్కటాధిపతేహం (2)
నమో నమోహరి నమో నమో ॥
గరుడ గమన గరుడధ్వజ .. (ప..)
