Annamayya Keerthanas Bhavayami Gopalabalam
అన్నమయ్య కీర్తన భావయామి గోపాలబాలం
Annamayya Keerthanas Bhavayami Gopalabalam
Stotram
Unknown
0 Verses
110%
అన్నమయ్య కీర్తన భావయామి గోపాలబాలం
శ్లోక 1
రాగం: యమునా కల్యాణి (65 మేచకల్యాణి జన్య)
ఆ: స రి2 గ3 ప మ2 ప ద2 స
అవ: స ద2 ప మ2 ప గ3 రి2 స
తాలం: ఖణ్డ చాపు
పల్లవి
భావయామి గోపాలబాలం
మన-స్సేవితం తత్పదం చిన్తయేహం సదా ॥
చరణం 1
కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘణ్టికా-
పటల నినదేన విభ్రాజమానం ।
కుటిల పద ఘటిత సఙ్కుల శిఞ్జితేనతం
చటుల నటనా సముజ్జ్వల విలాసం ॥
భావయామి గోపాలబాలం (ప)
మన-స్సేవితం తత్పదం చిన్తయేహం సదా ॥ (ప)
చరణం 2
నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం ।
తిరువేఙ్కటాచల స్థితం అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం ॥
భావయామి గోపాలబాలం (ప )
మన-స్సేవితం తత్పదం చిన్తయేహం సదా ॥ (ప )
