Ashtakam - Sacred Scripture in telugu

Bhramarambika Ashtakam

భ్రమరామ్బికా అష్టకమ్

Bhramarambika Ashtakam

Ashtakam
Rama
10 Verses
110%

భ్రమరామ్బికా అష్టకమ్

శ్లోక 1

రవిసుధాకర వహ్నిలోచన రత్నకుణ్డల భూషిణీ

ప్రవిమలమ్బుగ మమ్మునేలిన భక్తజన చిన్తామణీ ।

అవని జనులకు కొఙ్గుబఙ్గారైన దైవశిఖామణీ

శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరామ్బికా

శ్లోక 2

కలియుగమ్బున మానవులకును కల్పతరువై యుణ్డవా

వెలయగును శ్రీ శిఖరమన్దున విభవమై విలసిల్లవా ।

ఆలసిమ్పక భక్తవరులకు అష్టసమ్పద లీయవా

జిలుగు కుఙ్కుమ కాన్తిరేఖల శ్రీగిరి భ్రమరామ్బికా

॥ 1 ॥

శ్లోక 3

అఙ్గ వఙ్గ కలిఙ్గ కాశ్మీరాన్ధ్ర దేశములన్దునన్

పొఙ్గుచును వరహాల కొఙ్కణ పుణ్యభూముల యన్దునన్ ।

రఙ్గుగా కర్ణాట రాట మరాట దేశములన్దునన్

శృఙ్గినీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరామ్బికా

॥ 2 ॥

శ్లోక 4

అక్షయమ్బుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై

సాక్షిగణపతి కన్న తల్లివి సద్గుణావతి శామ్భవీ ।

మోక్షమోసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివి

శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరామ్బికా

॥ 3 ॥

శ్లోక 5

ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ

విగ్రహమ్బుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ ।

అగ్రపీఠమునన్దు వెలసిన ఆగమార్థ విచారిణీ

శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరామ్బికా

॥ 4 ॥

శ్లోక 6

నిగమగోచర నీలకుణ్డలి నిర్మలాఙ్గి నిరఞ్జనీ

మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ ।

జగతిలోన ప్రసిద్ధికెక్కిన చన్ద్రముఖి సీమన్తినీ

చిగురుటాకులవణ్టి పెదవుల శ్రీగిరి భ్రమరామ్బికా

॥ 5 ॥

శ్లోక 7

సోమశేఖర పల్లవాధరి సున్దరీమణీ ధీమణీ

కోమలాఙ్గి కృపాపయోనిధి కుటిలకున్తల యోగినీ ।

నా మనమ్బున పాయకుణ్డమ నగకులేశుని నన్దినీ

సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరామ్బికా

॥ 6 ॥

శ్లోక 8

భూతనాథుని వామభాగము పొన్దుగా చేకొన్దువా

ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొణ్టివా ।

పాతకమ్బుల పారద్రోలుచు భక్తులను చేకొణ్టివా

శ్వేతగిరిపై నుణ్డి వెలసిన శ్రీగిరి భ్రమరామ్బికా

॥ 7 ॥

శ్లోక 9

ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నన్దున

పల్లవిఞ్చును నీ ప్రభావము బ్రహ్మలోకము నన్దున ।

తెల్లముగ కైలాసమన్దున మూడులోకము లన్దున

చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరామ్బికా

॥ 8 ॥

శ్లోక 10

తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ

కరుణతో మమ్మేలు యెప్పుడు కల్పవృక్షము భఙ్గినీ ।

వరుసతో నీ యష్టకమ్బును వ్రాసి చదివిన వారికి

సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరామ్బికా

॥ 9 ॥

శ్లోక 11