Stotram - Sacred Scripture in telugu

Tyagaraja Keerthanas Marugelara O Raghava

త్యాగరాజ కీర్తన మరుగేలరా ఓ రాఘవా

Tyagaraja Keerthanas Marugelara O Raghava

Stotram
Unknown
0 Verses
110%

త్యాగరాజ కీర్తన మరుగేలరా ఓ రాఘవా

శ్లోక 1

రాగం: జయన్తశ్రీ

20 నటభైరవి జన్య

ఆ: స గ2 మ1 ద1 ని2 స

అవ: స ని2 ద1 మ1 ప మ1 గ2 స

తాలం: దేశాది

పల్లవి

మరుగేలరా ఓ రాఘవా!

అనుపల్లవి

మరుగేల - చరా చర రూప

పరాత్పర సూర్య సుధాకర లోచన

చరణం 1

అన్ని నీ వనుచు అన్తరఙ్గమున

తిన్నగా వెదకి తెలుసుకొణ్టి నయ్య

నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల

నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత

మరుగేలరా ఓ రాఘవా!