Tyagaraja Keerthanas Gandhamu Puyaruga
త్యాగరాజ కీర్తన గన్ధము పూయరుగా
Tyagaraja Keerthanas Gandhamu Puyaruga
Stotram
Unknown
0 Verses
110%
త్యాగరాజ కీర్తన గన్ధము పూయరుగా
శ్లోక 1
రాగం: పున్నాగవరాలి
తాలం: ఆది
పల్లవి:
గన్ధము పుయ్యరుగా పన్నీరు
గన్ధము పుయ్యరుగా
అను పల్లవి:
అన్దమయిన యదునన్దనుపై
కున్దరదన లిరవొన్దగ పరిమల ॥గన్ధము॥
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకలగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి ॥గన్ధము॥
చేలము గట్టరుగా బఙ్గారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి ॥గన్ధము॥
హారతులెత్తరుగా ముత్యాల హారతులెత్తరుగా
నారీమణులకు వారము యౌవన
వారక యొసగెడు వారిజాక్షునికి ॥గన్ధము॥
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి ॥గన్ధము॥
