Stotram - Sacred Scripture in telugu

Ramadasu Keerthanas Paluke Bangaaramaayena

రామదాసు కీర్తన పలుకే బఙ్గారమాయెనా

Ramadasu Keerthanas Paluke Bangaaramaayena

Stotram
Rama
0 Verses
110%

రామదాసు కీర్తన పలుకే బఙ్గారమాయెనా

శ్లోక 1

రాగం: ఆనన్ద భైరవి/ఆనన్ద భైరవి

20 నటభైరవి జన్య

ఆ: స గ2 రి2 గ2 మ1 ప ద2 ప ని2 స

అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స

తాలం: ఆది

పల్లవి

పలుకే బఙ్గారమాయెనా, కోదణ్డపాణి పలుకే బఙ్గారమాయెనా

చరణం 1

పలుకే బఙ్గారమాయె పిలచినా పలుకవేమి

కలలో నీ నామస్మరణ మరువ చక్కని తణ్డ్రీ ॥ పలుకే బఙ్గారమాయెనా ॥

చరణం 2

ఎన్త వేడినగాని సున్తైన దయరాదు

పన్తము సేయ నేనెన్తటివాడను తణ్డ్రీ ॥ పలుకే బఙ్గారమాయెనా ॥

చరణం 3

శరణాగతత్రాణ బిరుదాఙ్కితుడవుకాదా

కరుణిఞ్చు భద్రాచల వరరామదాస పోష ॥ పలుకే బఙ్గారమాయెనా ॥

చరణం 4

ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి

కరుణిఞ్చి బ్రోచితివని నెర నమ్మితిని తణ్డ్రీ ॥ పలుకే బఙ్గారమాయెనా ॥

చరణం 5

రాతి నాతిగ చేసి భూతలమున

ప్రఖ్యాతి చెన్దితివని ప్రీతితో నమ్మితి తణ్డ్రీ ॥ పలుకే బఙ్గారమాయెనా ॥

పలుకే బఙ్గారమాయె పిలచినా పలుకవేమి

కలలో నీ నామస్మరణ మరువ చక్కని తణ్డ్రీ-పలుకే బఙ్గారమాయెనా

పలుకే బఙ్గారమాయెనా, కోదణ్డపాణి పలుకే బఙ్గారమాయెనా