Stotram - Sacred Scripture in telugu

Ramadasu Keerthanas Ikshvaku Kula Tilaka

రామదాసు కీర్తన ఇక్ష్వాకు కుల తిలకా

Ramadasu Keerthanas Ikshvaku Kula Tilaka

Stotram
Rama
0 Verses
110%

రామదాసు కీర్తన ఇక్ష్వాకు కుల తిలకా

శ్లోక 1

రాగం: యదుకులకామ్భోజి

ఆ: స రి2 మ1 ప ద2 స

అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స

తాలం: మిశ్రచాపు

పల్లవి

ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచన్ద్రా నన్ను

రక్షిమ్పకున్నను రక్షకులెవరిఙ్క రామచన్ద్రా ..

చరణం 1

భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచన్ద్రా

ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 2

శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచన్ద్రా

ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 3

లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచన్ద్రా

ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 4

సీతమ్మకు చేయిస్తి చిన్తాకు పతకము రామచన్ద్రా

ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 5

కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచన్ద్రా

నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 6

మీ తణ్డ్రి దశరథమహారాజు పెట్టెనా రామచన్ద్రా

లేక మీమామ జనకమహారాజు పమ్పెనా రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 7

అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచన్ద్రా

ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 8

భక్తులన్దరిని పరిపాలిఞ్చెడి శ్రీరామచన్ద్రా

నీవు క్షేమముగ రామదాసుని నేలుము రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 9

చుట్టుప్రాకారములు సొమ్పుగ చేయిస్తి రామచన్ద్రా

ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 10

గోపురమణ్టపాలు కుదురుగ గట్టిస్తి రామచన్ద్రా నను

క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 11

వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచన్ద్రా జగ

న్మోహన సఙ్కెల్లు వేసిరి కాల్లకు రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 12

సర్కారు పైకము తృణముగనెఞ్చకు రామచన్ద్రా

దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 13

ఏటికి జల్లిన నీల్లాయె నా బ్రతుకు రామచన్ద్రా

నేను అధములన్దరికణ్టె అన్యాయమైతిని రామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥

చరణం 14

కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచన్ద్రా

కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచన్ద్రా ॥ ఇక్ష్వాకు కులతిలక ॥