Stotram - Sacred Scripture in telugu

Pahi Ramaprabho

పాహి రామప్రభో

Pahi Ramaprabho

Stotram
Rama
122 Verses
110%

పాహి రామప్రభో

శ్లోక 1

రాగమ్: మధ్యమావతి

తాలమ్: ఝమ్ప

పాహిరామప్రభో పాహిరామప్రభో

పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥

శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ

నామకీర్తనలు వర్ణిన్తు రామప్రభో

శ్లోక 2

॥ 1 ॥ పాహిరామప్రభో ॥

సున్దరాకార హృన్మన్దిరోద్ధార సీ

తేన్దిరా సంయుతానన్ద రామప్రభో

శ్లోక 3

॥ 2 ॥ పాహిరామప్రభో ॥

ఇన్దిరా హృదయారవిన్దాదిరూఢ

సున్దారాకార ఆనన్ద రామప్రభో

శ్లోక 4

॥ 3 ॥ పాహిరామప్రభో ॥

ఎన్దునేజూడ మీసున్దరాననము

కన్దునో కన్నులిమ్పొన్ద రామప్రభో

శ్లోక 5

॥ 4 ॥ పాహిరామప్రభో ॥

పుణ్యచారిత్రలావణ్య కారుణ్య గాం

భీర్య దాక్షిణ్య శ్రీరామచన్ద్రప్రభో

శ్లోక 6

॥ 5 ॥ పాహిరామప్రభో ॥

కన్దర్పజనక నాయన్దు రఞ్జిల సదా

నన్దుడవై పూజలన్దు రామప్రభో

శ్లోక 7

॥ 6 ॥ పాహిరామప్రభో ॥

ఇమ్పుగా జెవులకు న్విన్దుగా నీకథల్‌

కన్దుగా మిమ్ము సొమ్పొన్ద రామప్రభో

శ్లోక 8

॥ 7 ॥ పాహిరామప్రభో ॥

వన్దనముచేసి మునులన్దరు ఘనులైరి

విన్దవైనట్టి గోవిన్ద రామప్రభో

శ్లోక 9

॥ 8 ॥ పాహిరామప్రభో ॥

బృన్దారకాది సద్బృన్దార్చితావతార

విన్ద ముని సన్దర్శితానన్ద రామప్రభో

శ్లోక 10

॥ 9 ॥ పాహిరామప్రభో ॥

తల్లివినీవె మాతణ్డ్రివినీవె మా

ధాతవునీవె మాభ్రాత రామప్రభో

శ్లోక 11

॥ 10 ॥ పాహిరామప్రభో ॥

పల్లవాధరలైన గొల్లభామలగూడి

యుల్లమలరఙ్గ రఞ్జిల్లు రామప్రభో

శ్లోక 12

॥ 11 ॥ పాహిరామప్రభో ॥

మల్లరఙ్గమ్బునన్దెల్ల మల్లులజీరి

యల్ల కంసుని జమ్పు మల్ల రామప్రభో

శ్లోక 13

॥ 12 ॥ పాహిరామప్రభో ॥

కొల్లలుగ నీమాయ వెల్లివిరియగ జేయ

సల్లాపమున క్రీడసల్పు రామప్రభో

శ్లోక 14

॥ 13 ॥ పాహిరామప్రభో ॥

తమ్ముడును నీవు పార్శ్వమ్ములఞ్జేరి వి

ల్లమ్ములెక్కెడి నిల్చుటిమ్ము రామప్రభో

శ్లోక 15

॥ 14 ॥ పాహిరామప్రభో ॥

క్రమ్ముకొనిశాత్రవులు హుమ్మనుచువచ్చెదరు

ఇమ్మైనబాణములిమ్ము రామప్రభో

శ్లోక 16

॥ 15 ॥ పాహిరామప్రభో ॥

రమ్ము నాకభయమ్ము నిమ్ము నీపాదముల్‌

నమ్మినానయ్య శ్రీరామచన్ద్రప్రభో

శ్లోక 17

॥ 16 ॥ పాహిరామప్రభో ॥

కణ్టి మీ శఙ్ఖమ్ము కణ్టి మీ చక్రము

కణ్టి మీ పాదముల్గణ్టి రామప్రభో

శ్లోక 18

॥ 17 ॥ పాహిరామప్రభో ॥

విణ్టి మహిమ వెన్నణ్టి తమ్ముడు నీవు

జణ్టరావయ్య నావెణ్ట రామప్రభో

శ్లోక 19

॥ 18 ॥ పాహిరామప్రభో ॥

మేము నీవారమైనాము రక్షిమ్పుమ

న్నాము జాగేల శ్రీరామచన్ద్రప్రభో

శ్లోక 20

॥ 19 ॥ పాహిరామప్రభో ॥

నామనోవీధిని ప్రేమతోనుణ్డు మీ

భూమిజాసహిత జయ రామచన్ద్రప్రభో

శ్లోక 21

॥ 20 ॥ పాహిరామప్రభో ॥

మీ మహత్త్వమ్ము విన మనమన్దు ప్రేమ

వేమరున్‌ బుట్టు శ్రీరామచన్ద్రప్రభో

శ్లోక 22

॥ 21 ॥ పాహిరామప్రభో ॥

శ్యామసున్దర కోమలం జానకీమనః

కాముకం త్వం భజే రామచన్ద్రప్రభో

శ్లోక 23

॥ 22 ॥ పాహిరామప్రభో ॥

కామితార్థములిచ్చు నీ మహత్వము విన్న

నా మొరాలిఞ్చు నాస్వామి రామప్రభో

శ్లోక 24

॥ 23 ॥ పాహిరామప్రభో ॥

కామితప్రభుడవై ప్రేమతో రక్షిఞ్చు

స్వామి సాకేతపురి రామచన్ద్రప్రభో

శ్లోక 25

॥ 24 ॥ పాహిరామప్రభో ॥

అన్న రావన్న నీకన్న నామీద నెన

రున్న వారేరి నాయన్న రామప్రభో

శ్లోక 26

॥ 25 ॥ పాహిరామప్రభో ॥

నిన్నెగాకను మరే యన్యులగానన్‌

గన్నతణ్డ్రివిగ మాయన్న రామప్రభో

శ్లోక 27

॥ 26 ॥ పాహిరామప్రభో ॥

వెన్నదొఙ్గిలి తిన్న చిన్నకృష్ణమ్మ ని

న్నెన్నగా వశమె రావన్న రామప్రభో

శ్లోక 28

॥ 27 ॥ పాహిరామప్రభో ॥

ఎన్నెన్నో జన్మముల నెత్తజాలను ఇక

నిన్నె నెమ్మదిని వర్ణిన్తు రామప్రభో

శ్లోక 29

॥ 28 ॥ పాహిరామప్రభో ॥

ఎన్నివిధములనైన నిన్నె నమ్మిన వాని

మన్నిఞ్చి దయచేయుమన్న రామప్రభో

శ్లోక 30

॥ 29 ॥ పాహిరామప్రభో ॥

పన్నగాధిపశాయి భావనాతీత ఆ

పన్న నామనవి వినవన్న రామప్రభో

శ్లోక 31

॥ 30 ॥ పాహిరామప్రభో ॥

మేటివాక్యమ్బు మీసాటిదైవమ్బు ము

మ్మాటికిని భువిలేదు మేటి రామప్రభో

శ్లోక 32

॥ 31 ॥ పాహిరామప్రభో ॥

పాడుదును మిమ్ము గొనియాడుదును మోదమున

వేడుచున్నాను గాపాడు రామప్రభో

శ్లోక 33

॥ 32 ॥ పాహిరామప్రభో ॥

వేడుకోగానె నీజోడుకాడును నీవు

కూడి రారయ్య నాతోడ రామప్రభో

శ్లోక 34

॥ 33 ॥ పాహిరామప్రభో ॥

నేడు నాకోర్కె లీడేరగాజేసి కా

పాడరా కరినేలు జాడ రామప్రభో

శ్లోక 35

॥ 34 ॥ పాహిరామప్రభో ॥

మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొన్దు

వాడవని శ్రుతులు నిన్నాడు రామప్రభో

శ్లోక 36

॥ 35 ॥ పాహిరామప్రభో ॥

చూడు మీభక్తులను గూడు మీరిపుల గో

రాడు మీవల్ల గోవిన్ద రామప్రభో

శ్లోక 37

॥ 36 ॥ పాహిరామప్రభో ॥

పుణ్డరీకాక్ష మార్తాణ్డవంశోద్భవా

ఖణ్డలస్తుత్య కోదణ్డ రామప్రభో

శ్లోక 38

॥ 37 ॥ పాహిరామప్రభో ॥

కుణ్డలిశయన భూమణ్డలోద్ధరణ పా

షణ్డజనహరణ కోదణ్డరామప్రభో

శ్లోక 39

॥ 38 ॥ పాహిరామప్రభో ॥

నిణ్డుదయతోడ నాయణ్డ బాయకను నీ

వుణ్డి గాపాడు కోదణ్డరామప్రభో

శ్లోక 40

॥ 39 ॥ పాహిరామప్రభో ॥

జాతకౌతూహలం చక్షుకృత్యారమాం

పూతసీతాపతే దాత రామప్రభో

శ్లోక 41

॥ 40 ॥ పాహిరామప్రభో ॥

పాతకులలో మొదటి పాతకుడ నావణ్టి

పాతకుని కావుటే ఖ్యాతి రామప్రభో

శ్లోక 42

॥ 41 ॥ పాహిరామప్రభో ॥

భూతనాథుని విల్లు ఖ్యాతిగా ఖణ్డిఞ్చి

సీతగైకొన్న విఖ్యాత రామప్రభో

శ్లోక 43

॥ 42 ॥ పాహిరామప్రభో ॥

పూతనాకల్మషోద్ధూత పె\న్‌శత్రు సం

హారి శ్రీసీతాసమేత రామప్రభో

శ్లోక 44

॥ 43 ॥ పాహిరామప్రభో ॥

జాతినీతులులేక భూతలమ్బున దిరుగు

ఘాతకుల బరిమార్చు నేత రామప్రభో

శ్లోక 45

॥ 44 ॥ పాహిరామప్రభో ॥

ఎప్పుడును గణ్టికి రెప్పవలె గాచి న

న్నొప్పుగాగావు మాయప్ప రామప్రభో

శ్లోక 46

॥ 45 ॥ పాహిరామప్రభో ॥

ఏదయా నీదయా యోదయామ్భోనిధీ

యాదిలేదయ్య నామీద రామప్రభో

శ్లోక 47

॥ 46 ॥ పాహిరామప్రభో ॥

ఘోరరాక్షస గర్వహార విశ్వమ్భరో

ద్ధార గుణసాన్ద్రవిస్తార రామప్రభో

శ్లోక 48

॥ 47 ॥ పాహిరామప్రభో ॥

మోదమున నీవు నన్నాదుకోవయ్య గో

దావరీ తీర భద్రాద్రి రామప్రభో

శ్లోక 49

॥ 48 ॥ పాహిరామప్రభో ॥

నీదు బాణమ్బులను నాదుశత్రులబట్టి

బాధిమ్పకున్నావదేమి రామప్రభో

శ్లోక 50

॥ 49 ॥ పాహిరామప్రభో ॥

ఆదిమధ్యాన్త బహిరాన్తరాత్ముడవనుచు

వాదిన్తునే జగన్నాథ రామప్రభో

శ్లోక 51

॥ 50 ॥ పాహిరామప్రభో ॥

చాలదేమి పదాబ్జములసాటి యీపదు

నాల్గులోకమ్బుల గూడి రామప్రభో

శ్లోక 52

॥ 51 ॥ పాహిరామప్రభో ॥

ఏల యీలాగు జాగేల జేసెదవు మ

మ్మేలుకోవయ్య మాపాలి రామప్రభో

శ్లోక 53

॥ 52 ॥ పాహిరామప్రభో ॥

పాలువెన్నలు మ్రుచ్చిలిన్తివని యశోద

రోటగట్టిన మాయచాలు రామప్రభో

శ్లోక 54

॥ 53 ॥ పాహిరామప్రభో ॥

కొల్లలుగ వ్రేపల్లె పల్లవాధరులతో

నల్లబిల్లిగను రఞ్జిల్ల రామప్రభో

శ్లోక 55

॥ 54 ॥ పాహిరామప్రభో ॥

వాలి నొక్కమ్మునన్‌ గూలవేసిన శౌర్య

శాలియౌ నినుదలతు జాల రామప్రభో

శ్లోక 56

॥ 55 ॥ పాహిరామప్రభో ॥

సాలభఞ్జికల నిర్మూలమ్బు చేయగా

జాలితివి గోపాలబాల రామప్రభో

శ్లోక 57

॥ 56 ॥ పాహిరామప్రభో ॥

తాలవృక్షము లొక్కకోల ధరగూలగా

లీలనేసిన బాహుశాలి రామప్రభో

శ్లోక 58

॥ 57 ॥ పాహిరామప్రభో ॥

(శిలయైన యహల్య శ్రీపాదములు

సోక నెలతయై మిము మదితలచె

శ్లోక 59

॥ 58 ॥ పాహిరామప్రభో ॥)

వినవయ్య మనవి గైకొనవయ్య తప్పులన్‌

గనకయ్య సమ్మతిన్గొనుచు రామప్రభో

శ్లోక 60

॥ 59 ॥ పాహిరామప్రభో ॥

దానధర్మమ్బులున్‌ దపజపమ్బులు నీదు

నామకీర్తనకు సరిరావు రామప్రభో

శ్లోక 61

॥ 60 ॥ పాహిరామప్రభో ॥

మానావమానములు మహిని నీవై యుణ్డ

మాకేల మదిని ఈచిన్త రామప్రభో

శ్లోక 62

॥ 61 ॥ పాహిరామప్రభో ॥

జ్ఞానయోగాభ్యాసమన్దు నుణ్డెడివారి

కానన్దమయుడవైనావు రామప్రభో

శ్లోక 63

॥ 62 ॥ పాహిరామప్రభో ॥

భానువంశమునన్దు మానవాధిపుడవై

దానవుల బరిమార్చినావు రామప్రభో

శ్లోక 64

॥ 63 ॥ పాహిరామప్రభో ॥

అణురేణు పరిపూర్ణుడౌ హృదయవాస నా

మనవి విను దేవకీతనయ రామప్రభో

శ్లోక 65

॥ 64 ॥ పాహిరామప్రభో ॥

మాన్యమై ఆశ్రితవదాన్యమై సుజన స

న్మాన్యమై వెలుగు మూర్ధన్య రామప్రభో

శ్లోక 66

॥ 65 ॥ పాహిరామప్రభో ॥

నిత్యమై సత్యమై నిర్మలమ్బై మహిని

దివ్యవంశోత్తంసమైన రామప్రభో

శ్లోక 67

॥ 66 ॥ పాహిరామప్రభో ॥

సేవ్యమై మీపదద్భావ్యమై సజ్జన

శ్రావ్యమై యుణ్డునో దివ్య రామప్రభో

శ్లోక 68

॥ 67 ॥ పాహిరామప్రభో ॥

గట్టిగా నీవున\న్‌ పట్టుగా విహితమౌ

నట్టుగా మమ్ము చేపట్టు రామప్రభో

శ్లోక 69

॥ 68 ॥ పాహిరామప్రభో ॥

దిట్టయగు తాటకినిగొట్టి వేగమె గాధి

పట్టి యాగము గాచినట్టి రామప్రభో

శ్లోక 70

॥ 69 ॥ పాహిరామప్రభో ॥

చుట్టుకొని కాలిఙ్గు డట్టహాసముచేయ

పట్టుకొని తలనెక్కినట్టి రామప్రభో

శ్లోక 71

॥ 70 ॥ పాహిరామప్రభో ॥

సన్తతము నన్ను రక్షిన్తువని నమ్మి మి

మ్మెన్తురా జానకీకాన్త రామప్రభో

శ్లోక 72

॥ 71 ॥ పాహిరామప్రభో ॥

పన్తమున మీ పాదచిన్తనము చేయ నా

వన్తలన్నియు మానుటెన్త రామప్రభో

శ్లోక 73

॥ 72 ॥ పాహిరామప్రభో ॥

విన్తగాదయ్య నేనిన్తనాడినది నా

పన్తమున మిమ్ము భావిన్తు రామప్రభో

శ్లోక 74

॥ 73 ॥ పాహిరామప్రభో ॥

శాన్తమూర్తిని రమాకాన్తుడవని చాల

సన్తసమ్బున నిన్ను నెన్తు రామప్రభో

శ్లోక 75

॥ 74 ॥ పాహిరామప్రభో ॥

అక్షయమ్బైన నీకుక్షిలో లోకముల

రక్షిఞ్చితివి లక్ష్మీవక్ష రామప్రభో

శ్లోక 76

॥ 75 ॥ పాహిరామప్రభో ॥

దన్తివత్సల భక్తచిన్తామణీ విశ్వ

మన్తయును నీవు రక్షిఞ్చు రామప్రభో

శ్లోక 77

॥ 76 ॥ పాహిరామప్రభో ॥

పక్షివాహన శత్రునిక్షేపణా నన్ను

రక్షిఞ్చు మోక్షప్రదాత రామప్రభో

శ్లోక 78

॥ 77 ॥ పాహిరామప్రభో ॥

రక్షిఞ్చి సజ్జనుల వీక్షిఞ్చి దుర్జనుల

రాక్షసుల శిక్షిఞ్చినావు రామప్రభో

శ్లోక 79

॥ 78 ॥ పాహిరామప్రభో ॥

రక్షకుడవై జగద్రక్షణముచేయగా

రాక్షసుల శిక్షిఞ్చినావు రామప్రభో

శ్లోక 80

॥ 79 ॥ పాహిరామప్రభో ॥

లక్ష్మీకటాక్ష వీక్షణధార వృష్టి మా

కక్షయమ్బుగ కటాక్షిఞ్చు రామప్రభో

శ్లోక 81

॥ 80 ॥ పాహిరామప్రభో ॥

రావయా అభయమ్బు లీవయా నాస్వామీ

నీవయా గతి దేవరాయ రామప్రభో

శ్లోక 82

॥ 81 ॥ పాహిరామప్రభో ॥

కావు కావుమటఞ్చు కాకాసురుడురాగ

కాచి రక్షిఞ్చినావయ్య రామప్రభో

శ్లోక 83

॥ 82 ॥ పాహిరామప్రభో ॥

దేవదేవోత్తమా దేవేన్ద్రసన్నుతా

కావవేనన్ను శ్రీరామచన్ద్రప్రభో

శ్లోక 84

॥ 83 ॥ పాహిరామప్రభో ॥

భావజజనక నా బాధలన్నియుమాన్పి

యే విధమ్బునైన నేలు రామప్రభో

శ్లోక 85

॥ 84 ॥ పాహిరామప్రభో ॥

శ్రీవైష్ణవులపాలి చిన్తామణివి చాల

సేవగైకొని కరుణచేయు రామప్రభో

శ్లోక 86

॥ 85 ॥ పాహిరామప్రభో ॥

భావమున మిముభక్తి సేవిఞ్చు జనులకు

కైవల్యమొసగు శ్రీరామచన్ద్రప్రభో

శ్లోక 87

॥ 86 ॥ పాహిరామప్రభో ॥

గోపాలురను గూడి యావులను మేపి

ఆపదోద్ధారకుడవైన రామప్రభో

శ్లోక 88

॥ 87 ॥ పాహిరామప్రభో ॥

నాపాలి శ్రీరామ భూపాలకా నను

కాపాడరావ గోపాల రామప్రభో

శ్లోక 89

॥ 88 ॥ పాహిరామప్రభో ॥

సారమౌశౌర్య విస్తారమౌ సున్దరా

కారసద్భక్తమన్దార రామప్రభో

శ్లోక 90

॥ 89 ॥ పాహిరామప్రభో ॥

శరణాగతత్రాణ బిరుదాఙ్కితమ్బైన

వరము నాకొసగు యేమరక రామప్రభో

శ్లోక 91

॥ 90 ॥ పాహిరామప్రభో ॥

శ్రీరామ రామేతి శ్రేష్ఠమన్త్రము సారె

సారెకును విన్తగా జదువ రామప్రభో

శ్లోక 92

॥ 91 ॥ పాహిరామప్రభో ॥

శ్రీరామ నీనామ చిన్తనామృతపాన

సారమే నాదుమది గోరు రామప్రభో

శ్లోక 93

॥ 92 ॥ పాహిరామప్రభో ॥

చేరి మీపాద పద్మారాధనము చేయ

కోరినానయ్య శ్రీరామచన్ద్రప్రభో

శ్లోక 94

॥ 93 ॥ పాహిరామప్రభో ॥

ఘోరరాక్షసగర్వహారి విశ్వమ్భరా

భూరిగుణసాన్ద్ర విస్తార రామప్రభో

శ్లోక 95

॥ 94 ॥ పాహిరామప్రభో ॥

మారీచమాయానివార శరసన్ధాన

ధారుణీతనయా విహార రామప్రభో

శ్లోక 96

॥ 95 ॥ పాహిరామప్రభో ॥

పరవాసుదేవ యక్షయపాత్ర మొసగి న

న్నరసి పోషిమ్పగదవయ్య రామప్రభో

శ్లోక 97

॥ 96 ॥ పాహిరామప్రభో ॥

పరధనమ్బును పరస్త్రీల నపేక్షిఞ్చు

నరుకబ్బునే మోక్షమరయ రామప్రభో

శ్లోక 98

॥ 97 ॥ పాహిరామప్రభో ॥

కామాదిదుర్గుణ స్తోమమ్బులడగ మీ

నామామృతమె దిక్కు రామచన్ద్రప్రభో

శ్లోక 99

॥ 98 ॥ పాహిరామప్రభో ॥

దుష్టులగు దానవుల నష్టమ్బుగా జేయగా

బుట్టితివి కౌసల్య పట్టి రామప్రభో

శ్లోక 100

॥ 99 ॥ పాహిరామప్రభో ॥

కష్టపడలేనయ్య పట్టాభిరామ నా

కిష్టసమ్పదలిచ్చి యేలు రామప్రభో

శ్లోక 101

॥ 100 ॥ పాహిరామప్రభో ॥

కేశవాయనిన భవపాశములొలగు స

ర్వేశకోటి శశిప్రకాశ రామప్రభో

శ్లోక 102

॥ 101 ॥ పాహిరామప్రభో ॥

నారాయణా నీదు నామామృతం బెపుడు

పారాయణము చేతు నేను రామప్రభో

శ్లోక 103

॥ 102 ॥ పాహిరామప్రభో ॥

మాధవాయనియు సమ్మోదమున నినుగొల్చు

సాధుసజ్జనదయామ్భోధి రామప్రభో

శ్లోక 104

॥ 103 ॥ పాహిరామప్రభో ॥

గోవిన్ద గోవిన్ద గోపాలకృష్ణయని

గోపకులు గొనియాడు గోపరామప్రభో

శ్లోక 105

॥ 104 ॥ పాహిరామప్రభో ॥

విష్ణునా సర్వవర్ధిష్ణునా తత్త్వ భూ

యిష్ణునా నిర్మితం కృష్ణ రామప్రభో

శ్లోక 106

॥ 105 ॥ పాహిరామప్రభో ॥

శ్రీధరా శ్రీకరా శ్రీనారసింహ గం

గాధర స్తోత్ర యానన్ద రామప్రభో

శ్లోక 107

॥ 106 ॥ పాహిరామప్రభో ॥

మత్స్యమై జలధిలో జొచ్చి సోమకుద్రుఞ్చి

తెచ్చి వేదము లజునకిస్తి రామప్రభో

శ్లోక 108

॥ 107 ॥ పాహిరామప్రభో ॥

కూర్మరూపము నొన్ది కొణ్డమూపునదాల్చి

కూర్మితో నమృతమ్బుగూర్చి రామప్రభో

శ్లోక 109

॥ 108 ॥ పాహిరామప్రభో ॥

వరాహరూపమున వసుధగొమ్ముననెత్తి

సురల రక్షిఞ్చు దాశరథి రామప్రభో

శ్లోక 110

॥ 109 ॥ పాహిరామప్రభో ॥

శరణన్న ప్రహ్లాదు గరుణిఞ్చి రక్షిమ్ప

నరసింహమూర్తివైనట్టి రామప్రభో

శ్లోక 111

॥ 110 ॥ పాహిరామప్రభో ॥

వామనత్వమున భూదానమడిగియు బలిని

భూమిక్రిన్దనడఞ్చి పొల్చు రామప్రభో

శ్లోక 112

॥ 111 ॥ పాహిరామప్రభో ॥

పరశురాముడనఙ్గ నరపాలకులనెల్ల

నరసిపొరికొన్న దాశరథి రామప్రభో

శ్లోక 113

॥ 112 ॥ పాహిరామప్రభో ॥

శ్రీరామమూర్తివై యారావణుని తలల్‌

ధారుణిన్‌ పడగూర్చినావు రామప్రభో

శ్లోక 114

॥ 113 ॥ పాహిరామప్రభో ॥

హలధరుడవై ధరాస్థలిపాలకులనెల్ల

బొరిపుచ్చి వెలుగుమాపాలి రామప్రభో

శ్లోక 115

॥ 114 ॥ పాహిరామప్రభో ॥

సిద్ధసన్నుత మనోబద్ధుణ్డవై నీవు

బౌద్ధుణ్డవైతి ప్రబుద్ధ రామప్రభో

శ్లోక 116

॥ 115 ॥ పాహిరామప్రభో ॥

కలికిరూపముదాల్చి కలియుగమ్బున నీవు

వెలసితివి భద్రాద్రినిలయ రామప్రభో

శ్లోక 117

॥ 116 ॥ పాహిరామప్రభో ॥

అవ్యయుడవైన నీయవతారముల జూచి

దివ్యులైనారు మునులయ్య రామప్రభో

శ్లోక 118

॥ 117 ॥ పాహిరామప్రభో ॥

శ్రీరామనామమే వేలస్మరియిన్తు

స్వామి దయచేయు సమ్పదను రామప్రభో

శ్లోక 119

॥ 118 ॥ పాహిరామప్రభో ॥

అప్ప శేషశయన యెప్పుడు నిను మరువ

నొప్పుగా బ్రోవు వరదప్ప రామప్రభో

శ్లోక 120

॥ 119 ॥ పాహిరామప్రభో ॥

తెప్పరమ్బులుదీర్చి యిప్పుడేమరక నన్‌

ద్రిప్పు బెట్టక చేపట్టు రామప్రభో

శ్లోక 121

॥ 120 ॥ పాహిరామప్రభో ॥

పట్టాభిరామ నీపాదపద్మాశ్రయుల

పాలిమ్పుమా భద్రశైలి రామప్రభో

శ్లోక 122

॥ 121 ॥ పాహిరామప్రభో ॥

పట్టాభిరామ నిను ప్రభుడవని నమ్మితిని

కష్టపెట్టకను చేపట్టు రామప్రభో

శ్లోక 123

॥ 122 ॥ పాహిరామప్రభో ॥