Stotram - Sacred Scripture in telugu

Ramadasu Keerthanas E Teeruga Nanu Daya Choochedavo

రామదాసు కీర్తన ఏ తీరుగ నను దయ చూచెదవో

Ramadasu Keerthanas E Teeruga Nanu Daya Choochedavo

Stotram
Rama
0 Verses
110%

రామదాసు కీర్తన ఏ తీరుగ నను దయ చూచెదవో

శ్లోక 1

రాగం: నాదనామక్రియ/నాదనామక్రియ

15 మాయమాలవ గొవ్ల జన్య

ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3

అవ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3

తాలం: ఆది

పల్లవి

ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇనవంశోత్తమ రామా

నా తరమా భవ సాగరమీదను, నలిన దలేక్షణ రామా ॥ ఏ తీరుగ ॥

చరణం 1

శ్రీ రఘు నన్దన సీతా రమణా, శ్రితజన పోషక రామా

కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా ॥ ఏ తీరుగ ॥

చరణం 2

క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెఞ్చకు రామా

దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా ॥ ఏ తీరుగ ॥

చరణం 3

వాసవనుత రామదాస పోషక వన్దన-మయోధ్య రామా

దాసార్చిత మాకభయ-మొసఙ్గవే దాశరథీ రఘురామా ॥ ఏ తీరుగ ॥

చరణం 4

గురుడవు నా మది దైవము నీవని గురుశాస్త్రమ్బులు రామా

గురుదైవమ్బని యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా ॥ ఏ తీరుగ ॥

చరణం 5

నిణ్డితి వీ వఖిలాణ్డ కోతి బ్రహ్మాణ్డములన్దున రామా

నిణ్డుగ మది నీ నామము దలచిన నిత్యానన్దము రామా ॥ ఏ తీరుగ ॥

చరణం 6

వాసవ కమల భవాసురవన్దిత వారధి బన్ధన రామా

భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా ॥ ఏ తీరుగ ॥

చరణం 7

మురిపెముతో నా స్వామివి నేవని మున్దుగ తెల్పితి రామా

మరువక ఇక నభిమానమున్చు నే మరుగుజొఛితిని రామా ॥ ఏ తీరుగ ॥

ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇనవంశోత్తమ రామా

నా తరమా భవ సాగరమీదను, నలిన దలేక్షణ రామా