Stotram - Sacred Scripture in telugu

Rama Laali Meghashyama Laali

రామ లాలీ మేఘశ్యామ లాలీ

Rama Laali Meghashyama Laali

Stotram
Rama
0 Verses
110%

రామ లాలీ మేఘశ్యామ లాలీ

శ్లోక 1

రామ లాలీ మేఘశ్యామ లాలీ

తామరసా నయన దశరథ తనయ లాలీ ॥

అచ్చావదన ఆటలాడి అలసినావురా

బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ॥

జోల పాడి జోకొట్టితె ఆలకిఞ్చెవు

చాలిఞ్చమరి ఊరుకుణ్టే సఞ్జ్ఞ చేసేవు ॥

ఎన్తో ఎత్తు మరిగినావు ఏమి సేతురా

ఇన్తుల చేతుల కాకలకు ఎన్తో కన్దేవు ॥