Manidweepa Varnanam (Telugu)
మణిద్వీప వర్ణనమ్ (తెలుగు)
Manidweepa Varnanam (Telugu)
మణిద్వీప వర్ణనమ్ (తెలుగు)
మహాశక్తి మణిద్వీప నివాసినీ
ముల్లోకాలకు మూలప్రకాశినీ ।
మణిద్వీపములో మన్త్రరూపిణీ
మన మనసులలో కొలువైయున్ది ॥ 1 ॥
సుగన్ధ పుష్పాలెన్నో వేలు
అనన్త సున్దర సువర్ణ పూలు ।
అచఞ్చలమ్బగు మనో సుఖాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 2 ॥
లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్సమ్పదలు ।
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 3 ॥
పారిజాతవన సౌగన్ధాలు
సూరాధినాధుల సత్సఙ్గాలు ।
గన్ధర్వాదుల గానస్వరాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 4 ॥
భువనేశ్వరి సఙ్కల్పమే జనియిఞ్చే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవున గలవు ।
మధుర మధురమగు చన్దనసుధలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 5 ॥
అరువది నాలుగు కలామతల్లులు
వరాలనొసగే పదారు శక్తులు ।
పరివారముతో పఞ్చబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 6 ॥
అష్టసిద్ధులు నవనవనిధులు
అష్టదిక్కులు దిక్పాలకులు ।
సృష్టికర్తలు సురలోకాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 7 ॥
కోటిసూర్యుల ప్రచణ్డ కాన్తులు
కోటిచన్ద్రుల చల్లని వెలుగులు ।
కోటితారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 8 ॥
భువనేశ్వరి సఙ్కల్పమే జనియిఞ్చే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
కఞ్చు గోడల ప్రాకారాలు
రాగి గోడల చతురస్రాలు ।
ఏడామడల రత్నరాశులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 9 ॥
పఞ్చామృతమయ సరోవరాలు
పఞ్చలోహమయ ప్రాకారాలు ।
ప్రపఞ్చమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 10 ॥
ఇన్ద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైఢూర్యాలు ।
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 11 ॥
సప్తకోటిఘన మన్త్రవిద్యలు
సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు ।
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 12 ॥
భువనేశ్వరి సఙ్కల్పమే జనియిఞ్చే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
మిలమిలలాడే ముత్యపు రాశులు
తలతలలాడే చన్ద్రకాన్తములు ।
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 13 ॥
కుబేర ఇన్ద్ర వరుణ దేవులు
శుభాల నొసగే అగ్నివాయువులు ।
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు ॥ 14 ॥
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పఞ్చభూతములు పఞ్చశక్తులు ।
సప్తృషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 15 ॥
కస్తూరి మల్లిక కున్దవనాలు
సూర్యకాన్తి శిల మహాగ్రహాలు ।
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 16 ॥
భువనేశ్వరి సఙ్కల్పమే జనియిఞ్చే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
మన్త్రిణి దణ్డిని శక్తిసేనలు
కాలి కరాలీ సేనాపతులు ।
ముప్పదిరెణ్డు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 17 ॥
సువర్ణ రజిత సున్దరగిరులు
అనఙ్గదేవి పరిచారికలు ।
గోమేధికమణి నిర్మితగుహలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 18 ॥
సప్తసముద్రములనన్త నిధులు
యక్ష కిన్నెర కిమ్పురుషాదులు ।
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు ॥ 19 ॥
మానవ మాధవ దేవగణములు
కామధేనువు కల్పతరువులు ।
సృష్టి స్థితి లయ కారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 20 ॥
భువనేశ్వరి సఙ్కల్పమే జనియిఞ్చే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
కోటి ప్రకృతుల సౌన్దర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు ।
పదారురేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 21 ॥
దివ్యఫలములు దివ్యాస్త్రములు
దివ్యపురుషులు ధీరమాతలు ।
దివ్యజగములు దివ్యశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ॥ 22 ॥
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాన్త భవనములు ।
మణినిర్మితమగు మణ్డపాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 23 ॥
పఞ్చభూతములు యాజమాన్యాలు
ప్రవాలసాలం అనేక శక్తులు ।
సన్తానవృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 24 ॥
భువనేశ్వరి సఙ్కల్పమే జనియిఞ్చే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
చిన్తామణులు నవరత్నాలు
నూరామడల వజ్రపురాశులు ।
వసన్తవనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 25 ॥
దుఃఖము తెలియని దేవీసేనలు
నటనాట్యాలు సఙ్గీతాలు ।
ధనకనకాలు పురుషార్ధాలు
మణిద్వీపానికి మహానిధులు ॥ 26 ॥
పదునాలుగు లోకాలన్నిటి పైన
సర్వలోకమను లోకము కలదు ।
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానమ్ ॥ 27 ॥
చిన్తామణుల మన్దిరమన్దు
పఞ్చబ్రహ్మల మఞ్చముపైన ।
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో ॥ 28 ॥
భువనేశ్వరి సఙ్కల్పమే జనియిఞ్చే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
మణిగణఖచిత ఆభరణాలు
చిన్తామణి పరమేశ్వరిదాల్చి ।
సౌన్దర్యానికి సౌన్దర్యముగా
అగుపడుతున్ది మణిద్వీపములో ॥ 29 ॥
పరదేవతను నిత్యముకొలచి
మనసర్పిఞ్చి అర్చిఞ్చినచో ।
అపారధనము సమ్పదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తున్ది ॥ 30 ॥
నూతన గృహములు కట్టినవారు
మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు ।
చదివిన చాలు అన్తా శుభమే
అష్టసమ్పదల తులతూగేరు ॥ 31 ॥
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివిన చోట ।
తిష్టవేసుకుని కూర్చొనునణ్ట
కోటిశుభాలను సమకూర్చుటకై ॥ 32 ॥
భువనేశ్వరి సఙ్కల్పమే జనియిఞ్చే మణిద్వీపము ।
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ॥
About This Stotram
Overview
Manidweepa Varnanam (Telugu) is a 32-verse text describing Manidweepa, the transcendent abode of the Supreme Goddess (Mahashakti) in the Shakta and Tantric traditions. This Telugu version presents the description of the divine realm in a form distinct from the longer Sanskrit Devi Bhagavatam account, and belongs to the regional Telugu devotional literary tradition. The text is used for meditative visualization and devotional recitation.
What are the benefits of chanting Manidweepa Varnanam?
- Supports meditation on the transcendent nature of the Goddess
- Purifies the mind through contemplation of the divine abode
- Cultivates devotion to the Supreme Shakti
- Provides a structured focus for daily Devi worship
When is the best time to recite this?
Morning and evening recitation are standard. Navaratri and other occasions dedicated to the Goddess are especially appropriate times to engage with this text.
What is the historical and traditional background?
The concept of Manidweepa as the ultimate abode of Lalita Tripura Sundari is elaborated in Tantric literature, including commentaries on the Lalita Sahasranama and the Devi Bhagavatam. This Telugu version represents a regional adaptation of the theme, typical of how Shakta devotional literature was transmitted and localized across South India. The specific authorship and date of this text are unknown. It reflects the tradition of composing regional-language devotional texts inspired by Sanskrit Puranic and Tantric sources.
Available scripts
This text is available in 14 scripts: devanagari, tamil, telugu, kannada, malayalam, gujarati, bengali, iast, gurmukhi, oriya, assamese, sinhala, itrans, hk. Use the script selector above to switch between them.
Related Texts
- Manidweepa Varnana — the Sanskrit Devi Bhagavatam version of the same subject, providing the primary Puranic account
- Lalita Sahasranama — the thousand names of Lalita, the presiding deity of Manidweepa