Annamayya Keerthanas Vinnapaalu Vinavale
అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె
Annamayya Keerthanas Vinnapaalu Vinavale
అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె
శ్లోక 1
రాగమ్: భూపాల / భూపాలం
ఆ: స రి1 గ2 ప ద1 స
అవ: స ద1 ప గ2 రి1 స
తాలం: ఝమ్ప
పల్లవి
విన్నపాలు వినవలె విన్త విన్తలు ।
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5)
చరణం 1
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు ।
అల్లనల్ల నన్తనిన్త నదిగోవారే । (2)
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు ।
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ॥ (1.5)
విన్నపాలు వినవలె విన్త విన్తలు ।
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5)
చరణం 2
గరుడ కిన్నరయక్ష కామినులు గములై ।
విరహపు గీతముల విన్తాలాపాల । (2)
పరిపరివిధముల బాడేరు నిన్నదివో ।
సిరిమొగము దెరచి చిత్తగిఞ్చవేలయ్యా ॥ (1.5)
విన్నపాలు వినవలె విన్త విన్తలు ।
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5)
చరణం 3
పొఙ్కపు శేషాదులు తుమ్బురు నారదాదులు ।
పఙ్కజభవాదులు నీ పాదాలు చేరి । (2)
అఙ్కెలనున్నారు లేచి అలమేలుమఙ్గను ।
వేఙ్కటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ॥ (2)
విన్నపాలు వినవలె విన్త విన్తలు ।
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5)
