Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Brahma Kadigina Padamu

అన్నమయ్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదము

Annamayya Keerthanas Brahma Kadigina Padamu

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదము

శ్లోక 1

రాగం: కడిగిన

ఆ: స రి2 మ1 ప ని2 ద2 స

అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స

తాలం: ఆది

పల్లవి

బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మము దానె నీ పాదము ॥

చరణం 1

చెలగి వసుధ గొలిచిన నీ పాదము

బలి తల మోపిన పాదము ।

తలకగ గగనము తన్నిన పాదము

బలరిపు గాచిన పాదము ॥

బ్రహ్మ కడిగిన పాదము (ప )

చరణం 2

కామిని పాపము కడిగిన పాదము

పాముతల నిడిన పాదము ।

ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము

పామిడి తురగపు పాదము ॥

బ్రహ్మ కడిగిన పాదము (ప )

చరణం 3

పరమ యోగులకు పరి పరి విధముల

పరమొసగెడి నీ పాదము ।

తిరువేఙ్కటగిరి తిరమని చూపిన

పరమ పదము నీ పాదము ॥

బ్రహ్మ కడిగిన పాదము (ప )

బ్రహ్మము దానె నీ పాదము ॥