Stotram - Sacred Scripture in telugu

Sumati Satakam

సుమతీ శతకమ్

Sumati Satakam

Stotram
Unknown
108 Verses
110%

సుమతీ శతకమ్

శ్లోక 1

శ్రీ రాముని దయచేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనగా

ధారాలమైన నీతులు

నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ

శ్లోక 2

అక్కరకు రాని చుట్టము,

మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా

నెక్కిన బారని గుర్రము

గ్రక్కున విడవఙ్గవలయు గదరా సుమతీ

॥ 1 ॥

శ్లోక 3

అడిగిన జీతమ్బియ్యని

మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కణ్టెన్

వడిగల యెద్దుల గట్టుక

మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ

॥ 2 ॥

శ్లోక 4

అడియాస కొలువు గొలువకు,

గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్

విడువక కూరిమి సేయకు,

మడవిని దోడరకొణ్టి నరుగకు సుమతీ

॥ 3 ॥

శ్లోక 5

అధరము గదలియు, గదలక

మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ

అధికార రోగ పూరిత

బధిరాన్ధక శవము జూడ బాపము సుమతీ

॥ 4 ॥

శ్లోక 6

అప్పు కొని చేయు విభవము,

ముప్పున బృఆయమ్పుటాలు, మూర్ఖుని తపమున్,

దప్పరయని నృపు రాజ్యము

దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ

॥ 5 ॥

శ్లోక 7

అప్పిచ్చువాడు, వైద్యుడు

నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్

జొప్పడిన యూర నుణ్డుము

చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ

॥ 6 ॥

శ్లోక 8

అల్లుని మఞ్చితనమ్బు,

గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్,

బొల్లున దఞ్చిన బియ్యము,

దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ

॥ 7 ॥

శ్లోక 9

ఆకొన్న కూడె యమృతము,

తాకొఞ్చక నిచ్చువాఙ్డె దాత ధరిత్రిన్,

సోకోర్చువాడె మనుజుడు,

తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ

॥ 8 ॥

శ్లోక 10

ఆకలి యుడుగని కడుపును,

వేకటియగు లఞ్జ పడుపు విడువని బ్రతుకున్,

బ్రాకొన్న నూతి యుదకము,

మేకల పాడియును రోత మేదిని సుమతీ

॥ 9 ॥

శ్లోక 11

ఇచ్చునదే విద్య, రణమున

జొచ్చునదే మగతనమ్బు, సుకవీశ్వరులున్

మెచ్చునదే నేర్చు, వదుకు

వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ

॥ 10 ॥

శ్లోక 12

ఇమ్ముగ జదువని నోరును,

నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్,

దమ్ముల బిలువని నోరును

గుమ్మరి మను ద్రవ్వినట్టి గుణ్టర సుమతీ

॥ 11 ॥

శ్లోక 13

ఉడుముణ్డదె నూరేణ్డ్లును,

బడియుణ్డదె పేర్మి బాము పదినూరేణ్డ్లున్,

మడువున గొక్కెర యుణ్డదె,

కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ

॥ 12 ॥

శ్లోక 14

ఉత్తమగుణములు నీచున

కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా

నెత్తిచ్చి కరగి పోసిన

నిత్తడి బఙ్గారమగునె యిలలో సుమతీ?

॥ 13 ॥

శ్లోక 15

ఉదకము ద్రావెడు హయమును,

మదమున నుప్పొఙ్గుచుణ్డు మత్తేభమ్బున్,

మొదవు కడ నున్న వృషభము,

జదువని యానీచు గడకు జనకుర సుమతీ

॥ 14 ॥

శ్లోక 16

ఉపకారికి నుపకారము

విపరీతము గాదు సేయ వివరిమ్పఙ్గా;

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ

॥ 15 ॥

శ్లోక 17

ఉపమిమ్ప మొదలు తియ్యన

కపటం బెడనెడను జెఱకు కై వడినే పో

నెపములు వెదకును గడపట

గపటపు దుర్జాతి పొన్దు గదరా సుమతీ

॥ 16 ॥

శ్లోక 18

ఎప్పటి కెయ్యది ప్రస్తుత

మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్

నొప్పిఞ్చక, తా నొవ్వక,

తప్పిఞ్చుక తిరుగువాడు ధన్యుడు సుమతీ

॥ 17 ॥

శ్లోక 19

ఎప్పుడు దప్పులు వెదకెడు

నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్

సర్పమ్బు పడగ నీడను

గప్ప వసిఞ్చిన విధమ్బు గదరా సుమతీ

॥ 18 ॥

శ్లోక 20

ఎప్పుడు సమ్పద కలిగిన

నప్పుడు బన్ధువులు వత్తు రది యెట్లన్నన్

తెప్పలుగ జెఱువు నిణ్డిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ

॥ 19 ॥

శ్లోక 21

ఏఱకుమీ కసుగాయలు,

దూఱకుమీ బన్ధుజనుల దోషము సుమ్మీ,

పాఱకుమీ రణమన్దున,

మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ

॥ 20 ॥

శ్లోక 22

ఒక యూరికి నొక కరణము,

నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్,

గకవికలు గాక యుణ్డునె

సకలమ్బును గొట్టువడక సహజము సుమతీ

॥ 21 ॥

శ్లోక 23

ఒరు నాత్మ దలచు సతి విడు,

మఱుమాటలు పలుకు సతుల మన్నిమ్పకుమీ,

వెఱ పెఱుగని భటునేలకు,

తఱచుగ సతి గవయ బోకు, తగదుర సుమతీ

॥ 22 ॥

శ్లోక 24

ఒల్లని సతి నొల్లని పతి,

నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే

గొల్లణ్డు, కాక ధరలో

గొల్లణ్డును గొల్లడౌనె గుణమున సుమతీ

॥ 23 ॥

శ్లోక 25

ఓడల బణ్డ్లును వచ్చును,

ఓడలు నాబణ్డ్లమీద నొప్పుగ వచ్చున్,

ఓడలు బణ్డ్లును వలనే

వాడమ్బడు గలిమి లేమి వసుధను సుమతీ

॥ 24 ॥

శ్లోక 26

కడు బలవన్తుడైనను

బుడమిని బ్రాయమ్పుటాలి బుట్టిన యిణ్టన్

దడవుణ్డ నిచ్చెనేనియు

బడుపుగ నఙ్గడికి దానె బమ్పుట సుమతీ

॥ 25 ॥

శ్లోక 27

కనకపు సింహాసనమున

శునకము గూర్చుణ్డబెట్టి శుభ లగ్నమునం

దొనరగ బట్టము గట్టిన

వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ

॥ 26 ॥

శ్లోక 28

కప్పకు నొరగాలైనను,

సర్పమునకు రోగమైన, సతి తులువైనన్,

ముప్పున దరిద్రుడైనను,

తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ

॥ 27 ॥

శ్లోక 29

కమలములు నీట బాసిన

కమలాప్తుని రశ్మి సోకి కమలిన భఙ్గిన్

తమ తమ నెలవులు దప్పిన

తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ

॥ 28 ॥

శ్లోక 30

కరణము గరణము నమ్మిన

మరణాన్తక మౌను గాని మనలేడు సుమీ,

కరణము దన సరి కరణము

మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ

॥ 29 ॥

శ్లోక 31

కరణముల ననుసరిమ్పక

విరసమ్బున దిన్న తిణ్డి వికటిఞ్చు జుమీ

యిరుసున కన్దెన బెట్టక

పరమేశ్వరు బణ్డి యైన బారదు సుమతీ

॥ 30 ॥

శ్లోక 32

కరణము సాదైయున్నను,

గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్,

ధర దేలు మీటకున్నను,

గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ

॥ 31 ॥

శ్లోక 33

కసుగాయ గఱచి చూచిన

మసలక పస యొగరు రాక మధురమ్బగునా,

పస గలుగు యువతులుణ్డగ

పసి బాలల బొన్దువాడు పశువుర సుమతీ

॥ 32 ॥

శ్లోక 34

కవి కాని వాని వ్రాతయు,

నవరస భావములు లేని నాతుల వలపున్,

దవిలి చను పన్ది నేయని

వివిధాయుధ కౌశలమ్బు వృధరా సుమతీ

॥ 33 ॥

శ్లోక 35

కాదు సుమీ దుస్సఙ్గతి,

పోదుసుమీ "కీర్తి" కాన్త పొన్దిన పిదపన్,

వాదు సుమీ యప్పిచ్చుట,

లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ

॥ 34 ॥

శ్లోక 36

కాముకుడు దనిసి విడిచిన

కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్

బ్రేమమున జెఱకు పిప్పికి

చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ

॥ 35 ॥

శ్లోక 37

కారణము లేని నగవును,

బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో

బూరణము లేని బూరెయు,

వీరణము లేని పెణ్డ్లి వృధరా సుమతీ

॥ 36 ॥

శ్లోక 38

కులకాన్త తోడ నెప్పుడు

గలహిమ్పకు, వట్టి తప్పు ఘటియిమ్పకుమీ,

కలకణ్ఠి కణ్ట కన్నీ

రొలికిన సిరి యిణ్ట నుణ్డ నొల్లదు సుమతీ

॥ 37 ॥

శ్లోక 39

కూరిమి గల దినములలో

నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా

కూరిమి విరసమ్బైనను

నేరములే తోచు చుణ్డు నిక్కము సుమతీ

॥ 38 ॥

శ్లోక 40

కొఞ్చెపు నరు సఙ్గతిచే

నఞ్చితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్

గిఞ్చిత్తు నల్లి కుట్టిన

మఞ్చమునకు జేటు వచ్చు మహిలో సుమతీ

॥ 39 ॥

శ్లోక 41

కొక్కోకమెల్ల జదివిన,

చక్కనివాడైన, రాజ చన్ద్రుణ్డైనన్,

మిక్కిలి రొక్కము లియ్యక,

చిక్కదురా వారకాన్త సిద్ధము సుమతీ

॥ 40 ॥

శ్లోక 42

కొఱ గాని కొడుకు బుట్టిన

కొఱ గామియె కాదు, తణ్డ్రి గుణముల జెఱచున్

చెఱకు తుద వెన్ను బుట్టిన

జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ

॥ 41 ॥

శ్లోక 43

కోమలి విశ్వాసమ్బును,

బాములతో జెలిమి, యన్య భామల వలపున్,

వేముల తియ్యదనమ్బును,

భూమీశుల నమ్మికలును బొఙ్కుర సుమతీ

॥ 42 ॥

శ్లోక 44

గడన గల మగని జూచిన

నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో,

గడ నుడుగు మగని జూచిన

నడ పీనుగు వచ్చె నఞ్చు నగుదురు సుమతీ

॥ 43 ॥

శ్లోక 45

చిన్తిమ్పకు కడచిన పని,

కిన్తులు వలతురని నమ్మ కెన్తయు మదిలో,

నన్తఃపుర కాన్తలతో

మన్తనముల మాను మిదియె మతముర సుమతీ

॥ 44 ॥

శ్లోక 46

చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైనయట్లు పామరుడు దగన్

హేమమ్బు గూడ బెట్టిన

భూమీశుల పాల జేరు భువిలో సుమతీ

॥ 45 ॥

శ్లోక 47

చుట్టములు గాని వారలు

చుట్టములము నీకటఞ్చు సొమ్పు దలిర్పన్

నెట్టుకొని యాశ్రయిన్తురు

గట్టిగ ద్రవ్యమ్బు గలుగ గదరా సుమతీ

॥ 46 ॥

శ్లోక 48

చేతులకు దొడవు దానము,

భూతలనాథులకు దొడవు బొఙ్కమి ధరలో,

నీతియె తొడవెవ్వారికి,

నాతికి మానమ్బు తొడవు నయముగ సుమతీ

॥ 47 ॥

శ్లోక 49

తడ వోర్వక, యొడ లోర్వక,

కడు వేగం బడిచి పడిన గార్యం బగునే,

తడ వోర్చిన, నొడ లోర్చిన,

జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ

॥ 48 ॥

శ్లోక 50

తన కోపమె తన శత్రువు,

తన శాన్తమె తనకు రక్ష, దయ చుట్టమ్బౌ

తన సన్తోషమె స్వర్గము,

తన దుఃఖమె నరక మణ్డ్రు తథ్యము సుమతీ

॥ 49 ॥

శ్లోక 51

తన యూరి తపసి తపమును,

తన పుత్రుని విద్య పెమ్పు, దన సతి రూపున్,

దన పెరటి చెట్టు మన్దును,

మనసున వర్ణిమ్పరెట్టి మనుజులు సుమతీ

॥ 50 ॥

శ్లోక 52

తన కలిమి యిన్ద్ర భోగము,

తన లేమియె స్వర్గలోక దారిద్ర్యమ్బున్,

దన చావు జల ప్రలయము,

తను వలచిన యదియె రమ్భ తథ్యము సుమతీ

॥ 51 ॥

శ్లోక 53

తన వారు లేని చోటను,

జనమిఞ్చుక లేని చోట, జగడము చోటన్,

అనుమానమైన చోటను,

మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ

॥ 52 ॥

శ్లోక 54

తమలము వేయని నోరును,

విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్,

గమలములు లేని కొలకును,

హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ

॥ 53 ॥

శ్లోక 55

తలనుణ్డు విషము ఫణికిని,

వెలయఙ్గా దోక నుణ్డు వృశ్చికమునకున్,

తల తోక యనక యుణ్డును

ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ

॥ 54 ॥

శ్లోక 56

తలపొడుగు ధనము పోసిన

వెలయాలికి నిజము లేదు వివరిమ్పఙ్గా

దల దడివి బాస జేసిన

వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ

॥ 55 ॥

శ్లోక 57

తల మాసిన, నొలు మాసిన,

వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్

గులకాన్తలైన రోతురు

తిలకిమ్పగ భూమిలోన దిరముగ సుమతీ

॥ 56 ॥

శ్లోక 58

తాను భుజిమ్పని యర్థము

మానవ పతి జేరు గొన్త మఱి భూగతమౌ

గానల నీగలు గూర్చిన

తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ

॥ 57 ॥

శ్లోక 59

దగ్గఱ కొణ్డెము సెప్పెడు

ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి దా

నెగ్గు బ్రజ కాచరిఞ్చుట

బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ

॥ 58 ॥

శ్లోక 60

ధనపతి సఖుడై యుణ్డిన

నెనయఙ్గా శివుడు భిక్షమెత్తగ వలసెన్,

దన వారి కెన్త గలిగిన

దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ

॥ 59 ॥

శ్లోక 61

ధీరులకు జేయు మేలది

సారమ్బగు నారికేల సలిలము భఙ్గిన్

గౌరవమును మఱి మీదట

భూరి సుఖావహము నగును భువిలో సుమతీ

॥ 60 ॥

శ్లోక 62

నడువకుమీ తెరువొక్కట,

గుడువకుమీ శత్రు నిణ్ట గూరిమి తోడన్,

ముడువకుమీ పరధనముల,

నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ

॥ 61 ॥

శ్లోక 63

నమ్మకు సుఙ్కరి, జూదరి,

నమ్మకు మొగసాల వాని, నటు వెలయాలిన్,

నమ్మకు మఙ్గడి వానిని,

నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ

॥ 62 ॥

శ్లోక 64

నయమున బాలుం ద్రావరు,

భయమునను విషమ్మునైన భక్షిన్తురుగా,

నయమెన్త దోషకారియొ,

భయమే జూపఙ్గ వలయు బాగుగ సుమతీ

॥ 63 ॥

శ్లోక 65

నరపతులు మేఱ దప్పిన,

దిరమొప్పగ విధవ యిణ్ట దీర్పరి యైనన్,

గరణము వైదికుడైనను,

మరణాన్తక మౌనుగాని మానదు సుమతీ

॥ 64 ॥

శ్లోక 66

నవరస భావాలఙ్కృత

కవితా గోష్టియును, మధుర గానమ్బును దా

నవివేకి కెన్త జెప్పిన

జెవిటికి శఙ్ఖూదినట్లు సిద్ధము సుమతీ

॥ 65 ॥

శ్లోక 67

నవ్వకుమీ సభ లోపల,

నవ్వకుమీ తల్లి, దణ్డ్రి, నాథుల తోడన్,

నవ్వకుమీ పరసతితో,

నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ

॥ 66 ॥

శ్లోక 68

నీరే ప్రాణాధారము

నోరే రసభరితమైన నుడువుల కెల్లన్

నారియె నరులకు రత్నము

చీరయె శృఙ్గారమణ్డ్రు సిద్ధము సుమతీ

॥ 67 ॥

శ్లోక 69

పగవల దెవ్వరి తోడను,

వగవఙ్గా వలదు లేమి వచ్చిన పిదపన్,

దెగ నాడ వలదు సభలను

మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ

॥ 68 ॥

శ్లోక 70

పతికడకు, దన్ను గూరిన

సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్,

సుతుకడకు రిత్తచేతుల

మతిమన్తులు చనరు నీతి మార్గము సుమతీ

॥ 69 ॥

శ్లోక 71

పనిచేయునెడల దాసియు,

ననుభవమున రమ్భ, మన్త్రి యాలోచనలన్,

దనభుక్తి యెడల దల్లియు,

నన్ దన కులకాన్త యుణ్డు నగురా సుమతీ

॥ 70 ॥

శ్లోక 72

పరనారీ సోదరుడై,

పరధనముల కాసపడక, పరులకు హితుడై,

పరులు దను బొగడ నెగడక,

పరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ

॥ 71 ॥

శ్లోక 73

పరసతి కూటమి గోరకు,

పరధనముల కాసపడకు, బరునెఞ్చకుమీ,

సరిగాని గోష్టి సేయకు,

సిరిచెడి చుట్టమ్బు కడకు జేరకు సుమతీ

॥ 72 ॥

శ్లోక 74

పరసతుల గోష్ఠి నుణ్డిన

పురుషుడు గాఙ్గేయుడైన భువి నిన్ద పడున్,

బరసతి సుశీలయైనను

బరుసఙ్గతి నున్న నిన్ద పాలగు సుమతీ

॥ 73 ॥

శ్లోక 75

పరులకు నిష్టము సెప్పకు,

పొరుగిణ్డ్లకు బనులు లేక పోవకు మెపుడున్,

బరు గదిసిన సతి గవయకు,

మెఱిగియు బిరుసైన హయము లెక్కకు సుమతీ

॥ 74 ॥

శ్లోక 76

పర్వముల సతుల గవయకు,

ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,

గర్విమ్ప నాలి బెమ్పకు,

నిర్వహణము లేని చోట నిలువకు సుమతీ

॥ 75 ॥

శ్లోక 77

పలు దోమి సేయు విడియము,

తలగడిగిన నాటి నిద్ర, తరుణులయెడలన్

బొల యలుక నాటి కూటమి

వెల యిన్తని చెప్పరాదు వినరా సుమతీ

॥ 76 ॥

శ్లోక 78

పాటెఱుగని పతి కొలువును,

గూటమ్బున కెఱుకపడని కోమలి రతియున్,

బేటెత్త జేయు చెలిమియు,

నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ

॥ 77 ॥

శ్లోక 79

పాలను గలసిన జలమును

పాల విధమ్బుననె యుణ్డు బరికిమ్పఙ్గా

పాల చవి జెఱచు గావున

పాలసుడగు వాని పొన్దు వలదుర సుమతీ

॥ 78 ॥

శ్లోక 80

పాలసునకైన యాపద

జాలిమ్బడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్

తేలగ్ని బడగ బట్టిన

మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ

॥ 79 ॥

శ్లోక 81

పిలువని పనులకు బోవుట,

గలయని సతి గతియు, రాజు గానని కొలువుం,

బిలువని పేరణ్టమ్బును,

వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ

॥ 80 ॥

శ్లోక 82

పుత్రోత్సాహము తణ్డ్రికి

పుత్రుడు జన్మిఞ్చినపుడె పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని బొగడగ

పుత్రోత్సాహమ్బు నాడు పొన్దుర సుమతీ

॥ 81 ॥

శ్లోక 83

పురికిని ప్రాణము గోమటి,

వరికిని ప్రాణమ్బు నీరు వసుమతి లోనన్,

గరికిని ప్రాణము తొణ్డము,

సిరికిని ప్రాణమ్బు మగువ సిద్ధము సుమతీ

॥ 82 ॥

శ్లోక 84

పులి పాలు దెచ్చి యిచ్చిన,

నలవడగా గుణ్డె గోసి యఱచే నిడినన్,

దలపొడుగు ధనము బోసిన,

వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ

॥ 83 ॥

శ్లోక 85

పెట్టిన దినముల లోపల

నట్టడవులనైన వచ్చు నానార్థములున్,

బెట్టని దినముల గనకపు

గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ

॥ 84 ॥

శ్లోక 86

పొరుగున బగవాడుణ్డిన,

నిరవొన్దక వ్రాతకాడె యేలిక యైనన్,

ధర గాపు కొణ్డెమాడిన,

గరణాలకు బ్రదుకు లేదు గదరా సుమతీ

॥ 85 ॥

శ్లోక 87

బఙ్గారు కుదువ బెట్టకు,

సఙ్గరమున బాఱిపోకు సరసుడవైతే,

నఙ్గడి వెచ్చము వాడకు,

వెఙ్గలితో జెలిమి వలదు వినరా సుమతీ

॥ 86 ॥

శ్లోక 88

బలవన్తుడ నాకేమని

పలువురతో నిగ్రహిఞ్చి పలుకుట మేలా,

బలవన్త మైన సర్పము

చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ

॥ 87 ॥

శ్లోక 89

మదినొకని వలచి యుణ్డగ

మదిచెడి యొక క్రూర విటుడు మానక తిరుగున్

బది చిలుక పిల్లి పట్టిన

జదువునె యాపఞ్జరమున జగతిని సుమతీ

॥ 88 ॥

శ్లోక 90

మణ్డల పతి సముఖమ్బున

మెణ్డైన ప్రధాని లేక మెలగుట యెల్లన్

గొణ్డన్త మదపు టేనుగు

తొణ్డము లేకుణ్డినట్లు దోచుర సుమతీ

॥ 89 ॥

శ్లోక 91

మన్త్రిగలవాని రాజ్యము

తన్త్రము సెడకుణ్డ నిలుచు దఱచుగ ధరలో

మన్త్రి విహీనుని రాజ్యము

జన్త్రపు గీలూడినట్లు జరుగదు సుమతీ

॥ 90 ॥

శ్లోక 92

మాటకు బ్రాణము సత్యము,

కోటకు బ్రాణమ్బు సుభట కోటి, ధరిత్రిన్

బోటికి బ్రాణము మానము,

చీటికి బ్రాణమ్బు వ్రాలు సిద్ధము సుమతీ

॥ 91 ॥

శ్లోక 93

మానధను డాత్మధృతి చెడి

హీనుణ్డగు వాని నాశ్రయిఞ్చుట యెల్లన్

మానెడు జలముల లోపల

నేనుగు మెయి దాచినట్టు లెఱుగుము సుమతీ

॥ 92 ॥

శ్లోక 94

మేలెఞ్చని మాలిన్యుని,

మాలను, మొగసాలెవాని, మఙ్గలి హితుగా

నేలిన నరపతి రాజ్యము

నేల గలసి పోవుగాని నెగడదు సుమతీ

॥ 93 ॥

శ్లోక 95

రాపొమ్మని పిలువని యా

భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే

దీపమ్బు లేని యిణ్టను

జేపున కీల్లాడినట్లు సిద్ధము సుమతీ

॥ 94 ॥

శ్లోక 96

రూపిఞ్చి పలికి బొఙ్కకు,

ప్రాపగు చుట్టమ్బు నెగ్గు పలుకకు మదిలో,

గోపిఞ్చు రాజు గొల్వకు,

పాపపు దేశమ్బు సొఱకు పదిలము సుమతీ

॥ 95 ॥

శ్లోక 97

లావిగలవాని కణ్టెను

భావిమ్పగ నీతిపరుడు బలవన్తుణ్డౌ

గ్రానమ్బన్త గజమ్బును

మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ

॥ 96 ॥

శ్లోక 98

వఱదైన చేను దున్నకు,

కఱవైనను బన్ధుజనుల కడ కేగకుమీ,

పరులకు మర్మము చెప్పకు,

పిరికికి దలవాయి తనము పెట్టకు సుమతీ

॥ 97 ॥

శ్లోక 99

వరిపణ్ట లేని యూరును,

దొర యుణ్డని యూరు, తోడు దొరకని తెరువున్,

ధరను పతి లేని గృహమును

నరయఙ్గా రుద్రభూమి యనదగు సుమతీ

॥ 98 ॥

శ్లోక 100

వినదగు నెవ్వరు జెప్పిన

వినినన్తనె వేగ పడక వివరిమ్ప దగున్

కని కల్ల నిజము దెలిసిన

మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ

॥ 99 ॥

శ్లోక 101

వీడెము సేయని నోరును,

జేడెల యధరామృతమ్బు సేయని నోరున్,

పాడఙ్గరాని నోరును

బూడిద కిరవైన పాడు బొన్దర సుమతీ

॥ 100 ॥

శ్లోక 102

వెలయాలి వలన గూరిమి

గలగదు, మఱి గలిగెనేని కడతేఱదుగా,

బలువురు నడచెడు తెరువున

మొలవదు పువు, మొలిచెనేని పొదలదు సుమతీ

॥ 101 ॥

శ్లోక 103

వెలయాలు చేయు బాసలు,

వెలయగ మొగసాల బొన్దు వెలమల చెలిమిన్,

గలలోన గన్న కలిమియు

విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ

॥ 102 ॥

శ్లోక 104

వేసరపు జాతి గానీ,

వీసము దా జేయనట్టి వీరిడి గానీ,

దాసి కొడుకైన గానీ,

కాసులు గల వాడె రాజు గదరా సుమతీ

॥ 103 ॥

శ్లోక 105

శుభముల పొన్దని చదువును,

నభినయముగ రాగరసము నన్దని పాటల్,

గుభ గుభలు లేని కూటమి,

సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ

॥ 104 ॥

శ్లోక 106

సరసము విరసము కొఱకే,

పరిపూర్ణ సుఖమ్బు లధిక బాధల కొఱకే,

పెరుగుట విరుగుట కొఱకే,

ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ

॥ 105 ॥

శ్లోక 107

సిరి తా వచ్చిన వచ్చును

సలలితముగ నారికేల సలిలము భఙ్గిన్,

సిరి తా బోయిన బోవును

కరి మ్రిఙ్గిన వెలగ పణ్డు కరణిని సుమతీ

॥ 106 ॥

శ్లోక 108

స్త్రీల యెడ వాదులాడకు,

బాలురతో జెలిమిచేసి భాషిమ్పకుమీ,

మేలైన గుణము విడువకు,

మేలిన పతి నిన్ద సేయ కెన్నడు సుమతీ

॥ 107 ॥

శ్లోక 109

సుమతీ శతకమ్ | Lyrics in Telugu | Vedic Tithi