Stotram - Sacred Scripture in telugu

Narasimha Satakam

నారసింహ శతకమ్

Narasimha Satakam

Stotram
Unknown
0 Verses
110%

నారసింహ శతకమ్

001

సీ. శ్రీమనోహర । సురా - ర్చిత సిన్ధుగమ్భీర ।

భక్తవత్సల । కోటి - భానుతేజ ।

కఞ్జనేత్ర । హిరణ్య - కశ్యపాన్తక । శూర ।

సాధురక్షణ । శఙ్ఖ - చక్రహస్త ।

ప్రహ్లాద వరద । పా - పధ్వంస । సర్వేశ ।

క్షీరసాగరశాయి । - కృష్ణవర్ణ ।

పక్షివాహన । నీల - భ్రమరకున్తలజాల ।

పల్లవారుణపాద - పద్మయుగల ।

తే. చారుశ్రీచన్దనాగరు - చర్చితాఙ్గ ।

కున్దకుట్మలదన్త । వై - కుణ్ఠధామ ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

002

సీ. పద్మలోచన । సీస - పద్యముల్ నీ మీద

జెప్పబూనితినయ్య । - చిత్తగిమ్పు

గణ యతి ప్రాస ల - క్షణము జూడగలేదు

పఞ్చకావ్య శ్లోక - పఠన లేదు

అమరకాణ్డత్రయం - బరసి చూడగలేదు

శాస్త్రీయ గ్రన్ధముల్ - చదువలేదు

నీ కటాక్షమ్బున - నే రచిఞ్చెద గాని

ప్రజ్ఞ నాయది గాదు - ప్రస్తుతిమ్ప

తే. దప్పుగలిగిన సద్భక్తి - తక్కువౌనె

చెఱకునకు వఙ్కపోయిన - చెడునె తీపు?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

003

సీ. నరసింహ । నీ దివ్య - నామమన్త్రముచేత

దురితజాలము లన్ని - దోలవచ్చు

నరసింహ । నీ దివ్య - నామమన్త్రముచేత

బలువైన రోగముల్ - పాపవచ్చు

నరసింహ । నీ దివ్య - నామమన్త్రముచేత

రిపుసఙ్ఘముల సంహ - రిమ్పవచ్చు

నరసింహ । నీ దివ్య - నామమన్త్రముచేత

దణ్డహస్తుని బణ్ట్ల - దరమవచ్చు

తే. భలిర । నే నీ మహామన్త్ర - బలముచేత

దివ్య వైకుణ్ఠ పదవి సా - ధిమ్పవచ్చు

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

004

సీ. ఆదినారాయణా । - యనుచు నాలుకతోడ

బలుక నేర్చినవారి - పాదములకు

సాష్టాఙ్గముగ నమ - స్కార మర్పణ జేసి

ప్రస్తుతిఞ్చెదనయ్య - బహువిధముల

ధరణిలో నరులెన్త - దణ్డివారైనను

నిన్ను గాననివారి - నే స్మరిమ్ప

మేము శ్రేష్ఠుల మఞ్చు - మిదుకుచుఞ్చెడివారి

చెన్త జేరగనోను - శేషశయన

తే. పరమ సాత్వికులైన నీ - భక్తవరుల

దాసులకు దాసుడను జుమీ - ధాత్రిలోన

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

005

సీ. ఐశ్వర్యములకు ని - న్ననుసరిమ్పగలేదు

ద్రవ్య మిమ్మని వెణ్ట - దగులలేదు

కనక మిమ్మని చాల - గష్టపెట్టగలేదు

పల్ల కిమ్మని నోట - బలకలేదు

సొమ్ము లిమ్మని నిన్ను - నమ్మి కొల్వగలేదు

భూము లిమ్మని పేరు - పొగడలేదు

బలము లిమ్మని నిన్ను - బ్రతిమాలగాలేదు

పసుల నిమ్మని పట్టు - పట్టలేదు

తే. నేను గోరిన దొక్కటే - నీలవర్ణ

చయ్యనను మోక్షమిచ్చిన - జాలు నాకు

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

006

సీ. మన్దుణ్డనని నన్ను - నిన్ద చేసిననేమి?

నా దీనతను జూచి - నవ్వ నేమి?

దూరభావములేక - తూలనాడిన నేమి?

ప్రీతిసేయక వఙ్క - బెట్ట నేమి?

కక్కసమ్బులు పల్కి - వెక్కిరిఞ్చిన నేమి?

తీవ్రకోపముచేత - దిట్ట నేమి?

హెచ్చుమాటలచేత - నెమ్మె లాడిన నేమి?

చేరి దాపట గేలి - చేయనేమి?

తే. కల్పవృక్షమ్బువలె నీవు - గల్గ నిఙ్క

బ్రజల లక్ష్యమ్బు నాకేల? - పద్మనాభ ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

007

సీ. చిత్తశుద్ధిగ నీకు - సేవజేసెదగాని

పుడమిలో జనుల మె - ప్పులకు గాదు

జన్మపావనతకై - స్మరణజేసెద గాని

సరివారిలో బ్రతి - ష్థలకు గాదు

ముక్తికోసము నేను - మ్రొక్కి వేడెదగాని

దణ్డిభాగ్యము నిమి - త్తమ్బు గాదు

నిన్ను బొగడగ విద్య - నేర్చితినేకాని

కుక్షినిణ్డెడు కూటి - కొఱకు గాదు

తే. పారమార్థికమునకు నే బాటుపడితి

గీర్తికి నపేక్షపడలేదు - కృష్ణవర్ణ ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

008

సీ. శ్రవణ రన్ధ్రముల నీ - సత్కథల్ పొగడఙ్గ

లేశ మానన్దమ్బు - లేనివాడు

పుణ్యవన్తులు నిన్ను - బూజసేయగ జూచి

భావమన్దుత్సాహ - పడనివాడు

భక్తవర్యులు నీ ప్ర - భావముల్ పొగడఙ్గ

దత్పరత్వములేక - తలగువాడు

తనచిత్తమన్దు నీ - ధ్యాన మెన్నడు లేక

కాలమన్తయు వృధా - గడపువాడు

తే. వసుధలోనెల్ల వ్యర్ధుణ్డు - వాడె యగును

మఱియు జెడుగాక యెప్పుడు - మమతనొన్ది.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

009

సీ. గౌతమీస్నానాన - గడతేఱుద మటన్న

మొనసి చన్నీల్లలో - మునుగలేను

తీర్థయాత్రలచే గృ - తార్థు డౌదమటన్న

బడలి నేమమ్బు లే - నడపలేను

దానధర్మముల స - ద్గతిని జెన్దుదమన్న

ఘనముగా నాయొద్ద - ధనములేదు

తపమాచరిఞ్చి సా - ర్ధకము నొన్దుదమన్న

నిమిషమైన మనస్సు - నిలుపలేను

తే. కష్టములకోర్వ నాచేత - గాదు నిన్ను

స్మరణచేసెద నా యధా - శక్తి కొలది.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

010

సీ. అర్థివాణ్డ్రకు నీక - హాని జేయుట కణ్టె

దెమ్పుతో వసనాభి - దినుట మేలు

ఆడుబిడ్డలసొమ్ము - లపహరిఞ్చుట కణ్టె

బణ్డ గట్టుక నూత - బడుట మేలు

పరులకాన్తల బట్టి - బల్మి గూడుట కణ్టె

బడబాగ్ని కీలల - బడుట మేలు

బ్రతుకజాలక దొఙ్గ - పనులు చేయుట కణ్టె

గొఙ్గుతో ముష్టెత్తు - కొనుట మేలు

తే. జలజదలనేత్ర నీ భక్త - జనులతోడి

జగడమాడెడు పనికణ్టె - జావు మేలు

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

011

సీ. గార్దభమ్బున కేల - కస్తూరి తిలకమ్బు?

మర్కటమ్బున కేల - మలయజమ్బు?

శార్ధూలమునక కేల - శర్కరాపూపమ్బు?

సూకరమ్బున కేల - చూతఫలము?

మార్జాలమున కేల - మల్లెపువ్వులబన్తి?

గుడ్లగూబల కేల - కుణ్డలములు?

మహిషాని కేల ని - ర్మలమైన వస్త్రముల్?

బకసన్తతికి నేల - పఞ్జరమ్బు?

తే. ద్రోహచిన్తన జేసెడి - దుర్జనులకు

మధురమైనట్టి నీనామ - మన్త్రమేల?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

012

సీ. పసరమ్బు వఞ్జైన - బసులకాపరి తప్పు

ప్రజలు దుర్జనులైన - ప్రభుని తప్పు

భార్య గయ్యాలైన - బ్రాణనాధుని తప్పు

తనయుడు దుష్టయిన - తణ్డ్రి తప్పు

సైన్యమ్బు చెదిరిన - సైన్యనాధుని తప్పు

కూతురు చెడుగైన - మాత తప్పు

అశ్వమ్బు చెడుగైన - నారోహకుని తప్పు

దన్తి దుష్టయిన మా - వన్తు తప్పు

తే. ఇట్టి తప్పులెఱుఙ్గక - యిచ్చవచ్చి

నటుల మెలగుదు రిప్పు డీ - యవని జనులు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

013

సీ. కోతికి జలతారు - కుల్లాయి యేటికి?

విరజాజి పూదణ్డ - విధవ కేల?

ముక్కిడితొత్తుకు - ముత్తెమ్పు నత్తేల?

నద్ద మేమిటికి జా - త్యన్ధునకును?

మాచకమ్మకు నేల - మౌక్తికహారముల్?

క్రూరచిత్తునకు స - ద్గోష్ఠు లేల?

ఱఙ్కుబోతుకు నేల - బిఙ్కమ్పు నిష్ఠలు?

వావి యేటికి దుష్ట - వర్తనునకు?

తే. మాట నిలుకడ కుఙ్కరి - మోటు కేల?

చెవిటివానికి సత్కథ - శ్రవణ మేల?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

014

సీ. మాన్యమ్బులీయ స - మర్ధుడొక్కడు లేడు

మాన్యముల్ చెఱుప స - మర్ధు లన్త

యెణ్డిన యూల్లగో - డెఱిగిమ్ప డెవ్వడు

బణ్డిన యూల్లము - బ్రభువు లన్త

యితడు పేద యటఞ్చు - నెఱిగిమ్ప డెవ్వణ్డు

కలవారి సిరు లెన్న - గలరు చాల

దనయాలి చేష్టల - తప్పెన్న డెవ్వడు

బెఱకాన్త ఱఙ్కెన్న - బెద్ద లన్త

తే. యిట్టి దుష్టుల కధికార - మిచ్చినట్టి

ప్రభువు తప్పు లటఞ్చును - బలుకవలెను.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

015

సీ. తల్లిగర్భమునుణ్డి - ధనము తే డెవ్వడు

వెల్లిపోయెడినాడు - వెణ్టరాదు

లక్షాధికారైన - లవణ మన్నమె కాని

మెఱుగు బఙ్గారమ్బు - మ్రిఙ్గబోడు

విత్త మార్జనజేసి - విర్రవీగుటె కాని

కూడబెట్టిన సొమ్ము - తోడరాదు

పొన్దుగా మఱుగైన - భూమిలోపల బెట్టి

దానధర్మము లేక - దాచి దాచి

తే. తుదకు దొఙ్గల కిత్తురో - దొరల కవునొ

తేనె జుణ్టీగ లియ్యవా - తెరువరులకు?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

016

సీ. లోకమం దెవడైన - లోభిమానవు డున్న

భిక్ష మర్థిమి జేత - బెట్టలేడు

తాను బెట్టకయున్న - తగవు పుట్టదుగాని

యొరులు పెట్టగ జూచి - యోర్వలేడు

దాతదగ్గఱ జేరి - తన ముల్లె చెడినట్లు

జిహ్వతో జాడీలు - చెప్పుచుణ్డు

ఫలము విఘ్నమ్బైన - బలు సన్తసమునన్దు

మేలు కల్గిన జాల - మిణుకుచుణ్డు

తే. శ్రీరమానాథ । యిటువణ్టి - క్రూరునకును

భిక్షుకుల శత్రువని - పేరు పెట్టవచ్చు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

017

సీ. తనువులో బ్రాణముల్ = తరలిపొయ్యెడివేల

నీ స్వరూపమును ధ్యా - నిఞ్చునతడు

నిమిషమాత్రములోన - నిన్ను జేరును గాని

యముని చేతికి జిక్కి - శ్రమలబడడు

పరమసన్తోషాన - భజన జేసెడివారి

పుణ్య మేమనవచ్చు - భోగిశయన

మోక్షము నీ దాస - ముఖ్యుల కగు గాని

నరక మెక్కడిదయ్య - నలిననేత్ర

తే. కమలనాభ నీ మహిమలు - గానలేని

తుచ్ఛులకు ముక్తిదొరకుట - దుర్లభమ్బు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

018

సీ. నీలమేఘశ్యామ । - నీవె తణ్డ్రివి మాకు

కమలవాసిని మమ్ము - గన్నతల్లి

నీ భక్తవరులన్త - నిజమైన బాన్ధవుల్

నీ కటాక్షము మా క - నేకధనము

నీ కీర్తనలు మాకు - లోక ప్రపఞ్చమ్బు

నీ సహాయము మాకు - నిత్యసుఖము

నీ మన్త్రమే మాకు - నిష్కలఙ్కపు విద్య

నీ పద ధ్యానమ్బు - నిత్యజపము

తే. తోయజాతాక్ష నీ పాద - తులసిదలము

రోగముల కౌషధము బ్రహ్మ - రుద్రవినుత.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

019

సీ. బ్రతికినన్నాల్లు నీ - భజన తప్పను గాని

మరణకాలమునన్దు - మఱతునేమొ

యావేల యమదూత - లాగ్రహమ్బున వచ్చి

ప్రాణముల్ పెకలిఞ్చి - పట్టునపుడు

కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత

గమ్ప ముద్భవమన్ది - కష్టపడుచు

నా జిహ్వతో నిన్ను - నారాయణా యఞ్చు

బిలుతునో శ్రమచేత - బిలువనొ

తే. నాటి కిప్పుడె చేతు నీ - నామభజన

తలచెదను, జెవి నిడవయ్య । - ధైర్యముగను.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

020

సీ. పాఞ్చభౌతికము దు - ర్బలమైన కాయం బి

దెప్పుడో విడుచుట - యెఱుకలేదు

శతవర్షములదాక - మితము జెప్పిరి గాని

నమ్మరా దామాట - నెమ్మనమున

బాల్యమన్దో మఞ్చి - ప్రాయమన్దో లేక

ముదిమియన్దో లేక - ముసలియన్దొ

యూరనో యడవినో - యుదకమధ్యముననో

యెప్పుడో విడుచుట - యేక్షణమ్బొ

తే. మరణమే నిశ్చయము బుద్ధి - మన్తుడైన

దేహమున్నన్తలో మిమ్ము - దెలియవలయు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

021

సీ. తల్లిదణ్డ్రులు భార్య - తనయు లాప్తులు బావ

మఱదు లన్నలు మేన - మామగారు

ఘనముగా బన్ధువుల్ - గల్గినప్పటికైన

దాను దర్లగ వెణ్ట - దగిలి రారు

యముని దూతలు ప్రాణ - మపగరిఞ్చుక పోగ

మమతతో బోరాడి - మాన్పలేరు

బలగ మన్దఱు దుఃఖ - పడుట మాత్రమె కాని

యిఞ్చుక యాయుష్య - మియ్యలేరు

తే. చుట్టములమీది భ్రమదీసి - చూర జెక్కి

సన్తతము మిమ్ము నమ్ముట - సార్థకమ్బు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

022

సీ. ఇభరాజవరద । ని - న్నెన్త బిల్చినగాని

మాఱు పల్క వదేమి - మౌనితనమొ?

మునిజనార్చిత । నిన్ను - మ్రొక్కి వేడినగాని

కనుల జూడ వదేమి - గడుసుదనమొ?

చాల దైన్యమునొన్ది - చాటు చొచ్చినగాని

భాగ్య మియ్య వదేమి - ప్రౌఢతనమొ?

స్థిరముగా నీపాద - సేవ జేసెద నన్న

దొరకజాల వదేమి - ధూర్తతనమొ?

తే. మోక్షదాయక । యిటువణ్టి - మూర్ఖజనుని

కష్టపెట్టిన నీకేమి - కడుపునిణ్డు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

023

సీ. నీమీద కీర్తనల్ - నిత్యగానము జేసి

రమ్యమొన్దిమ్ప నా - రదుడగాను

సావధానముగ నీ - చరణ పఙ్కజ సేవ

సలిపి మెప్పమ్పఙ్గ - శబరిగాను

బాల్యమప్పటినుణ్డి - భక్తి నీయన్దున

గలుగను బ్రహ్లాద - ఘనుడగాను

ఘనముగా నీమీది - గ్రన్థముల్ గల్పిఞ్చి

వినుతిసేయను వ్యాస - మునినిగాను

తే. సాధుడను మూర్ఖమతి మను - ష్యాధముడను

హీనుడను జుమ్మి నీవు - న న్నేలుకొనుము.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

024

సీ. అతిశయమ్బుగ గల్ల - లాడనేర్చితిగాని

పాటిగా సత్యముల్ - పలుకనేర

సత్కార్య విఘ్నముల్ - సలుప నేర్చితిగాని

యిష్ట మొన్దగ నిర్వ - హిమ్పనేర

నొకరి సొమ్ముకు దోసి - లొగ్గ నేర్చితిగాని

చెలువుగా ధర్మమ్బు - సేయనేర

ధనము లియ్యఙ్గ వ - ద్దనగ నేర్చితిగాని

శీఘ్ర మిచ్చెడునట్లు - చెప్పనేర

తే. బఙ్కజాతాక్ష । నే నతి - పాతకుడను

దప్పులన్నియు క్షమియిమ్ప - దణ్డ్రి వీవె ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

025

సీ. ఉర్విలో నాయుష్య - మున్న పర్యన్తమ్బు

మాయ సంసారమ్బు - మరగి నరుడు

సకల పాపములైన - సఙ్గ్రహిఞ్చును గాని

నిన్ను జేరెడి యుక్తి - నేర్వలేడు

తుదకు గాలునియొద్ది - దూత లిద్దఱు వచ్చి

గుఞ్జుక చని వారు - గ్రుద్దుచుణ్డ

హింస కోర్వగ లేక - యేడ్చి గన్తులువేసి

దిక్కు లేదని నాల్గు - దిశలు చూడ

తే. దన్ను విడిపిమ్ప వచ్చెడి - ధన్యు డేడి

మున్దు నీదాసుడై యున్న - ముక్తి గలుగు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

026

సీ. అధిక విద్యావన్తు - లప్రయోజకులైరి

పూర్ణశుణ్ఠలు సభా - పూజ్యులైరి

సత్యవన్తులమాట - జన విరోధమ్బాయె

వదరుబోతులమాట - వాసికెక్కె

ధర్మవాదనపరుల్ - దారిద్ర్యమొన్దిరి

పరమలోభులు ధన - ప్రాప్తులైరి

పుణ్యవన్తులు రోగ - భూత పీడితులైరి

దుష్టమానవులు వ - ర్ధిష్ణులైరి

తే. పక్షివాహన । మావణ్టి - భిక్షుకులకు

శక్తిలేదాయె నిక నీవె - చాటు మాకు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

027

సీ. భుజబలమ్బున బెద్ద - పులుల జమ్పగవచ్చు

పాముకణ్ఠము జేత - బట్టవచ్చు

బ్రహ్మ రాక్షసకోట్ల - బాఱద్రోలగవచ్చు

మనుజుల రోగముల్ - మాన్పవచ్చు

జిహ్వ కిష్టముగాని - చేదు మ్రిఙ్గగవచ్చు

బదను ఖడ్గము చేత - నదమవచ్చు

గష్టమొన్దుచు ముణ్డ్ల - కమ్పలో జొరవచ్చు

దిట్టుబోతుల నోల్లు - కట్టవచ్చు

తే. బుడమిలో దుష్టులకు జ్ఞాన - బోధ తెలిపి

సజ్జనుల జేయలే డెన్త - చతురుదైన.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

028

సీ. అవనిలోగల యాత్ర - లన్ని చేయగవచ్చు

ముఖ్యుడై నదులన్దు - మునుగవచ్చు

ముక్కుపట్టుక సన్ధ్య - మొనసి వార్వగవచ్చు

దిన్నగా జపమాల - ద్రిప్పవచ్చు

వేదాల కర్థమ్బు - విఱిచి చెప్పగవచ్చు

శ్రేష్ఠ్ క్రతువు లెల్ల - జేయవచ్చు

ధనము లక్షలు కోట్లు - దానమియ్యగవచ్చు

నైష్ఠికాచారముల్ - నడుపవచ్చు

తే. జిత్త మన్యస్థలమ్బున - జేరకుణ్డ

నీ పదామ్భోజములయన్దు - నిలపరాదు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

029

సీ. కర్ణయుగ్మమున నీ - కథలు సోకినజాలు

పెద్ద పోగుల జోల్లు - పెట్టినట్లు

చేతు లెత్తుచు బూజ - సేయగల్గినజాలు

తోరమ్పు కడియాలు - దొడిగినట్లు

మొనసి మస్తకముతో - మ్రొక్క గల్గినజాలు

చెలువమైన తురాయి - చెక్కినట్లు

గలము నొవ్వగ నిన్ను - బలుక గల్గినజాలు

విన్తగా గణ్ఠీలు - వేసినట్లు

తే. పూని నిను గొల్చుటే సర్వ - భూషణమ్బు

లితర భూషణముల నిచ్చ - గిమ్పనేల.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

030

సీ. భువనరక్షక । నిన్ను - బొగడనేరని నోరు

వ్రజ కగోచరమైన - పాడుబొన్ద

సురవరార్చిత । నిన్ను - జూడగోరని కనుల్

జలములోపల నెల్లి - సరపుగుణ్డ్లు

శ్రీరమాధిమ । నీకు - సేవజేయని మేను

కూలి కమ్ముడువోని - కొలిమితిత్తి

వేడ్కతో నీకథల్ - వినని కర్ణములైన

గఠినశిలాదుల - గలుగు తొలలు

తే. పద్మలోచన నీమీద - భక్తిలేని

మానవుడు రెణ్డుపాదాల - మహిషమయ్య.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

031

సీ. అతివిద్యనేర్చుట - అన్నవస్త్రములకే

పసుల నార్జిఞ్చుట - పాలకొఱకె

సతిని బెణ్డ్లాడుట - సంసార సుఖముకే

సుతుల బోషిఞ్చుట - గతులకొఱకె

సైన్యముల్ గూర్చుట - శత్రుజయమునకే

సాము నేర్చుటలెల్ల - చావుకొఱకె

దానమిచ్చుటయు ముం - దటి సఞ్చితమునకే

ఘనముగా జదువుట - కడుపు కొఱకె

తే. యితర కామమ్బు గోరక - సతతముగను

భక్తి నీయన్దు నిలుపుట - ముక్తి కొఱకె

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

032

సీ. ధరణిలో వేయేణ్డ్లు - తనువు నిల్వగబోదు

ధన మెప్పటికి శాశ్వ - తమ్బు గాదు

దారసుతాదులు - తనవెణ్ట రాలేరు

భ్రుత్యులు మృతిని ద - ప్పిమ్పలేరు

బన్ధుజాలము తన్ను - బ్రతికిఞ్చుకోలేరు

బలపరాక్రమ మేమి - పనికి రాదు

ఘనమైన సకల భా - గ్యం బెన్త గల్గిన

గోచిమాత్రమ్బైన - గొనుచుబోడు

తే. వెర్రి కుక్కల భ్రమలన్ని - విడిచి నిన్ను

భజన జేసెడివారికి - బరమసుఖము.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

033

సీ. నరసింహ । నాకు దు - ర్ణయములే మెణ్డాయె

సుగుణ మొక్కటిలేదు - చూడ జనిన

నన్యకాన్తల మీద - నాశ మానగలేను

నొరుల క్షేమము చూచి - యోర్వలేను

ఇటువణ్టి దుర్బుద్ధు - లిన్ని నా కున్నవి

నేను జేసెడివన్ని - నీచకృతులు

నావణ్టి పాపిష్ఠి - నరుని భూలోకాన

బుట్టజేసితి వేల - భోగిశయన ।

తే. అబ్జదలనేత్ర । నాతణ్డ్రి - వైన ఫలము

నేరములు గాచి రక్షిమ్పు - నీవె దిక్కు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

034

సీ. ధీరత బరుల నిం - దిమ్ప నేర్చితి గాని

తిన్నగా నిను బ్రస్తు - తిమ్పనైతి

బొరుగు కామినులన్దు - బుద్ధి నిల్పితి గాని

నిన్ను సన్తతము ధ్యా - నిమ్పనైతి

బెరికిముచ్చట లైన - మురిసి విణ్టినిగాని

యెఞ్చి నీకథ లాల - కిఞ్చనైతి

గౌతుకమ్బున బాత - కము గడిఞ్చితిగాని

హెచ్చు పుణ్యము సఙ్గ్ర - హిమ్పనైతి

తే. నవనిలో నేను జన్మిఞ్చి - నన్దు కేమి

సార్థకము గానరాదాయె - స్వల్పమైన.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

035

సీ. అన్త్యకాలమునన్దు - నాయాసమున నిన్ను

దలతునో తలపనో - తలతు నిపుడె

నరసింహ । నరసింహ । - నరసింహ । లక్ష్మీశ ।

దానవాన్తక । కోటి - భానుతేజ ।

గోవిన్ద । గోవిన్ద । - గోవిన్ద । సర్వేశ ।

పన్నగాధిపశాయి । - పద్మనాభ ।

మధువైరి । మధువైరి । - మధువైరి । లోకేశ ।

నీలమేఘశరీర । నిగమవినుత ।

తే. ఈ విధమ్బున నీనామ - మిష్టముగను

భజనసేయుచు నున్దు నా - భావమన్దు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

036

సీ. ఆయురారోగ్య పు - త్రార్థ సమ్పదలన్ని

కలుగజేసెడి భార - కర్త వీవె

చదువు లెస్సగ నేర్పి - సభలో గరిష్ఠాధి

కార మొన్దిఞ్చెడి - ఘనుడ వీవె

నడక మఞ్చిది పెట్టి - నరులు మెచ్చేడునట్టి

పేరు రప్పిఞ్చెడి - పెద్ద వీవె

బలువైన వైరాగ్య - భక్తిజ్ఞానములిచ్చి

ముక్తి బొన్దిఞ్చెడు - మూర్తి వీవె

తే. అవనిలో మానవుల కన్ని - యాసలిచ్చి

వ్యర్థులను జేసి తెలిపెడి - వాడ వీవె.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

037

సీ. కాయ మెన్త భయాన - గాపాడిననుగాని

ధాత్రిలో నది చూడ - దక్క బోదు

ఏవేల నేరోగ - మేమరిఞ్చునొ? సత్త్వ

మొన్దఙ్గ జేయు నే - చన్దమునను

ఔషధమ్బులు మఞ్చి - వనుభవిఞ్చిన గాని

కర్మ క్షీణమ్బైన గాని - విడదు;

కోటివైద్యులు గుమ్పు - గూడివచ్చిన గాని

మరణ మయ్యెడు వ్యాధి - మాన్పలేరు

తే. జీవుని ప్రయాణకాలమ్బు - సిద్ధమైన

నిలుచునా దేహ మిన్దొక్క - నిమిషమైన?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

038

సీ. జన్దె మిమ్పుగ వేసి - సన్ధ్య వార్చిన నేమి

బ్రహ్మ మన్దక కాడు - బ్రాహ్మణుణ్డు

తిరుమణి శ్రీచూర్ణ - గురురేఖ లిడినను

విష్ణు నొన్దక కాడు - వైష్ణవుణ్డు

బూదిని నుదుటను - బూసికొనిన నేమి

శమ్భు నొన్దక కాడు - శైవజనుడు

కాషాయ వస్త్రాలు - గట్టి కప్పిన నేమి

యాశ పోవక కాడు - యతివరుణ్డు

తే. ఎన్ని లౌకికవేషాలు - గట్టుకొనిన

గురుని జెన్దక సన్ముక్తి - దొరకబోదు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

039

సీ. నరసింహ । నే నిన్ను - నమ్మినన్దుకు జాల

నెనరు నాయన్దుఞ్చు - నెమ్మనమున

నన్ని వస్తువులు ని - న్నడిగి వేసటపుట్టె

నిఙ్కనైన గటాక్ష - మియ్యవయ్య

సన్తసమ్బున నన్ను - స్వర్గమన్దే యుఞ్చు

భూమియన్దే యుఞ్చు - భోగశయన ।

నయముగా వైకుణ్ఠ - నగరమన్దే యుఞ్చు

నరకమన్దే యుఞ్చు - నలిననాభ ।

తే. ఎచట నన్నుఞ్చిననుగాని - యెపుడు నిన్ను

మఱచి పోకుణ్డ నీనామ - స్మరణనొసగు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

040

సీ. దేహ మున్నవఱకు - మోహసాగరమన్దు

మునుగుచున్దురు శుద్ధ - మూఢజనులు

సలలితైశ్వర్యముల్ - శాశ్వతం బనుకొని

షడ్భ్రమలను మాన - జాల రెవరు

సర్వకాలము మాయ - సంసార బద్ధులై

గురుని కారుణ్యమ్బు గోరుకొనరు

జ్ఞాన భక్తి విరక్తు - లైన పెద్దల జూచి

నిన్ద జేయక - తాము నిలువలేరు

తే. మత్తులైనట్టి దుర్జాతి - మనుజులెల్ల

నిన్ను గనలేరు మొదటికే - నీరజాక్ష.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

041

సీ. ఇలలోన నే జన్మ - మెత్తినప్పటినుణ్డి

బహు గడిఞ్చితినయ్య - పాతకములు

తెలిసి చేసితి గొన్ని - తెలియజాలక చేసి

బాధ నొన్దితి నయ్య - పద్మనాభ

అనుభవిఞ్చెడు నప్పు - దతి ప్రయాసమ్బఞ్చు

బ్రజలు చెప్పగ జాల - భయము గలిగె

నెగిరి పోవుటకునై - యే యుపాయమ్బైన

జేసి చూతమటన్న - జేతగాదు

తే. సూర్యశశినేత్ర । నీచాటు - జొచ్చి నాను

కలుషములు ద్రుఞ్చి నన్నేలు - కష్టమనక.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

042

సీ. తాపసార్చిత । నేను - పాపకర్ముడనఞ్చు

నాకు వఙ్కలబెట్ట - బోకుచుమ్మి

నాటికి శిక్షలు - నన్ను చేయుటకణ్టె

నేడు సేయుము నీవు - నేస్తమనక

అతిభయఙ్కరులైన - యమదూతలకు నన్ను

నొప్పగిమ్పకు మయ్య - యురగశయన ।

నీ దాసులను బట్టి - నీవు దణ్డిమ్పఙ్గ

వద్దు వద్దన రెన్త - పెద్దలైన

తే. దణ్డ్రివై నీవు పరపీడ - దగులజేయ

వాసిగల పేరు కపకీర్తి - వచ్చునయ్య.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

043

సీ. ధరణిలోపల నేను - తల్లిగర్భమునన్దు

బుట్టినప్పటినుణ్డి - పుణ్యమెఱుగ

నేకాదశీవ్రతం - బెన్న డుణ్డుగ లేదు

తీర్థయాత్రలకైన - దిరుగలేదు

పారమార్థికమైన - పనులు చేయగలేదు

భిక్ష మొక్కనికైన - బెట్టలేదు

జ్ఞానవన్తులకైన - బూని మ్రొక్కగలేదు

ఇతర దానములైన - నియ్యలేదు

తే. నలినదలనేత్ర । నిన్ను నే - నమ్మినాను

జేరి రక్షిమ్పవే నన్ను - శీఘ్రముగను.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

044

సీ. అడవిపక్షుల కెవ్వ - డాహార మిచ్చెను

మృగజాతి కెవ్వడు - మేతబెట్టె

వనచరాదులకు భో - జన మెవ్వ డిప్పిఞ్చె

జెట్ల కెవ్వడు నీల్లు - చేదిపోసె

స్త్రీలగర్భమ్బున - శిశువు నెవ్వడు పెఞ్చె

ఫణుల కెవ్వడు పోసె - బరగ బాలు

మధుపాలి కెవ్వడు - మకరన్ద మొనరిఞ్చె

బసుల మెవ్వ డొసఙ్గె - బచ్చిపూరి

తే. జీవకోట్లను బోషిమ్ప - నీవెకాని

వేఱె యొక దాత లేడయ్య - వెదకిచూడ.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

045

సీ. దనుజారి । నావణ్టి - దాసజాలము నీకు

కోటి సఙ్ఖ్య గలారు - కొదువ లేదు

బణ్ట్లసన్దడివల్ల - బహుపరాకై నన్ను

మఱచి పోకుము భాగ్య - మహిమచేత

దణ్డిగా భ్రుత్యులు - దగిలి నీకుణ్డఙ్గ

బక్కబం టేపాటి - పనికి నగును?

నీవు మెచ్చెడి పనుల్ - నేను జేయగలేక

యిన్త వృథాజన్మ - మెత్తినాను

తే. భూజనులలోన నే నప్ర - యోజకుడను

గనుక నీ సత్కటాక్షమ్బు - గలుగజేయు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

046

సీ. కమలలోచన । నన్ను - గన్నతణ్డ్రివిగాన

నిన్ను నేమఱకుణ్టి - నేను విడక

యుదరపోషణకునై - యొకరి నే నాశిమ్ప

నేర నా కన్నమ్బు - నీవు నడపు

పెట్టలే నణ్టివా - పిన్న పెద్దలలోన

దగవు కిప్పుడు దీయ - దలచినాను

ధనము భారమ్బైన - దలకిరీటము నమ్ము

కుణ్డలమ్బులు పైడి - గొలుసు లమ్ము

తే. కొసకు నీ శఙ్ఖ చక్రముల్ - కుదువబెట్టి

గ్రాసము నొసఙ్గి పోషిఞ్చు - కపటముడిగి.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

047

సీ. కువలయశ్యామ । నీ - కొలువు చేసిన నాకు

జీత మెన్దుకు ముట్ట - జెప్పవైతి

మఞ్చిమాటలచేత - గొఞ్చెమియ్యగలేవు

కలహమౌ నిక జుమ్మి - ఖణ్డితముగ

నీవు సాధువు గాన - నిన్త పర్యన్తమ్బు

చనవుచే నిన్నాల్లు - జరుపవలసె

నిక నే సహిమ్ప నీ - విపుడు నన్నేమైన

శిక్ష చేసిన జేయు - సిద్ధమయితి

తే. నేడు కరుణిమ్పకుణ్టివా - నిశ్చయముగ

దెగబడితి చూడు నీతోడ - జగడమునకు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

048

సీ. హరి । నీకు బర్యఙ్క - మైన శేషుడు చాల

బవనము భక్షిఞ్చి - బ్రతుకుచుణ్డు

ననువుగా నీకు వా - హనమైన ఖగరాజు

గొప్పపామును నోట - గొఱుకుచుణ్డు

అదిగాక నీ భార్య - యైన లక్ష్మీదేవి

దినము పేరణ్టమ్బు - దిరుగుచుణ్డు

నిన్ను భక్తులు పిల్చి - నిత్యపూజలు చేసి

ప్రేమ బక్వాన్నముల్ - పెట్టుచుణ్డ్రు

తే. స్వస్థముగ నీకు గ్రాసము - జరుగుచుణ్డు

గాసు నీ చేతి దొకటైన - గాదు వ్యయము.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

049

సీ. పుణ్డరీకాక్ష । నా - రెణ్డు కన్నుల నిణ్డ

నిన్ను జూచెడి భాగ్య - మెన్నడయ్య

వాసిగా నా మనో - వాఞ్ఛ దీరెడునట్లు

సొగసుగా నీరూపు - చూపవయ్య

పాపకర్ముని కణ్ట - బడకపోవుదమఞ్చు

బరుషమైన ప్రతిజ్ఞ - బట్టినావె?

వసుధలో బతిత పా - వనుడ వీ వఞ్చు నే

బుణ్యవన్తులనోట - బొగడ విణ్టి

తే. నేమిటికి విస్తరిఞ్చె నీ - కిన్త కీర్తి

ద్రోహినైనను నా కీవు - దొరకరాదె?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

050

సీ. పచ్చి చర్మపు దిత్తి - పసలేదు దేహమ్బు

లోపల నన్తట - రోయ రోత

నరములు శల్యముల్ - నవరన్ధ్రములు రక్త

మాంసమ్బు కణ్డలు - మైల తిత్తి

బలువైన యెణ్డ వా - నల కోర్వ దిన్తైన

దాలలే దాకలి - దాహములకు

సకల రోగములకు - సంస్థానమె యుణ్డు

నిలువ దస్థిరమైన - నీటిబుగ్గ

తే. బొన్దిలో నుణ్డు ప్రాణముల్ - పోయినన్త

గాటికే గాని కొఱగాదు - గవ్వకైన.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

051

సీ. పలురోగములకు నీ - పాదతీరమె కాని

వలపు మన్దులు నాకు - వలదు వలదు

చెలిమి సేయుచు నీకు - సేవ జేసెద గాన

నీ దాసకోటిలో - నిలుపవయ్య

గ్రహభయమ్బునకు జ - క్రము దలచెదగాని

ఘోరరక్షలు గట్ట - గోరనయ్య

పాముకాటుకు నిన్ను - భజన జేసెదగాని

దాని మన్త్రము నేను - తలపనయ్య

తే. దొరికితివి నాకు దణ్డి వై - ద్యుడవు నీవు

వేయికష్టాలు వచ్చినన్ - వెఱవనయ్య.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

052

సీ. కూటికోసరము నే - గొఱగాని జనులచే

బలుగద్దరిమ్పులు - పడగవలసె?

దార సుత భ్రమ - దగిలియుణ్డగగదా

దేశదేశములెల్ల - దిరుగవలసె?

బెను దరిద్రత పైని - బెనగియుణ్డగగదా

చేరి నీచులసేవ - చేయవలసె?

నభిమానములు మది - నణ్టియుణ్డగగదా

పరుల జూచిన భీతి - పడగవలసె?

తే. నిటుల సంసారవారిధి - నీదలేక

వేయివిధముల నిన్ను నే - వేడుకొణ్టి.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

053

సీ. సాధు సజ్జనులతో - జగడమాడిన గీడు

కవులతో వైరమ్బు - గాఞ్చ గీడు

పరమ దీనుల జిక్క - బట్టి కొట్టిన గీడు

భిక్షగాణ్డ్రను దుఃఖ - పెట్ట గీడు

నిరుపేదలను జూచి - నిన్దజేసిన గీడు

పుణ్యవన్తుల దిట్ట - బొసగు గీడు

సద్భక్తులను దిర - స్కారమాడిన గీడు

గురుని ద్రవ్యము దోచు - కొనిన గీడు

తే. దుష్టకార్యము లొనరిఞ్చు - దుర్జనులకు

ఘనతరమ్బైన నరకమ్బు - గట్టిముల్లె.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

054

సీ. పరులద్రవ్యముమీద - భ్రాన్తి నొన్దినవాడు

పరకాన్తల నపేక్ష - పడెడువాడు

అర్థుల విత్తమ్బు - లపహరిఞ్చెడువాడు

దానమియ్యఙ్గ వ - ద్దనెడివాడు

సభలలోపల నిల్చి - చాడిచెప్పెడివాడు

పక్షపు సాక్ష్యమ్బు - పలుకువాడు

విష్ణుదాసుల జూచి - వెక్కిరిఞ్చెడివాడు

ధర్మసాధుల దిట్ట - దలచువాడు

తే. ప్రజల జన్తుల హింసిఞ్చు - పాతకుణ్డు

కాలకిఙ్కర గదలచే - గష్టమొన్దు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

055

సీ. నరసింహ । నా తణ్డ్రి - నన్నేలు నన్నేలు

కామితార్థము లిచ్చి - కావు కావు

దైత్యసంహార । చాల - దయయుఞ్చు దయయుఞ్చు

దీనపోషక । నీవె - దిక్కు దిక్కు

రత్నభూషితవక్ష । - రక్షిఞ్చు రక్షిఞ్చు

భువనరక్షక । నన్ను - బ్రోవు బ్రోవు

మారకోటిసురూప । - మన్నిఞ్చు మన్నిఞ్చు

పద్మలోచన । చేయి - పట్టు పట్టు

తే. సురవినుత । నేను నీచాటు - జొచ్చినాను

నా మొఱాలిఞ్చి కడతేర్చు - నాగశయన ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

056

సీ. నీ భక్తులను గనుల్ - నిణ్డ జూచియు రెణ్డు

చేతుల జోహారు - సేయువాడు

నేర్పుతో నెవరైన - నీ కథల్ చెప్పఙ్గ

వినయమన్దుచు జాల - వినెడువాడు

తన గృహమ్బునకు నీ - దాసులు రా జూచి

పీటపై గూర్చుణ్డ - బెట్టువాడు

నీసేవకుల జాతి - నీతు లెన్నక చాల

దాసోహ మని చేర - దలచువాడు

తే. పరమభక్తుణ్డు ధన్యుణ్డు - భానుతేజ ।

వాని గనుగొన్న బుణ్యమ్బు - వసుధలోన.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

057

సీ. పక్షివాహన । నేను - బ్రతికినన్నిదినాలు

కొణ్డెగాణ్డ్రను గూడి - కుమతినైతి

నన్నవస్త్రము లిచ్చి - యాదరిమ్పుము నన్ను

గన్నతణ్డ్రివి నీవె - కమలనాభ ।

మరణ మయ్యెడినాడు - మమతతో నీయొద్ది

బణ్ట్ల దోలుము మున్దు - బ్రహ్మజనక ।

ఇనజభటావలి - యీడిచికొనిపోక

కరుణతో నాయొద్ద - గావ లుఞ్చు

తే. కొసకు నీ సన్నిధికి బిల్చు - కొనియు నీకు

సేవకుని జేసికొనవయ్య - శేషశయన ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

058

సీ. నిగమాదిశాస్త్రముల్ - నేర్చిన ద్విజుడైన

యజ్ఞకర్తగు సోమ - యాజియైన

ధరణిలోపల బ్రభా - త స్నానపరుడైన

నిత్యసత్కర్మాది - నిరతుడైన

నుపవాస నియమమ్బు - లొన్దు సజ్జనుడైన

గావివస్త్రముగట్టు - ఘనుడునైన

దణ్డిషోడశమహా - దానపరుణ్డైన

సకల యాత్రలు సల్పు - సరసుడైన

తే. గర్వమున గష్టపడి నిన్ను - గానకున్న

మోక్షసామ్రాజ్య మొన్దడు - మోహనాఙ్గ ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

059

సీ. పఞ్జరమ్బున గాకి - బట్టి యుఞ్చిన లెస్స

పలుకునే విన్తైన - చిలుకవలెను?

గార్దభమ్బును దెచ్చి - కల్లెమిమ్పుగవేయ

దిరుగునే గుర్రమ్బు - తీరుగాను?

ఎనుపపోతును మావ - టీ డు శిక్షిఞ్చిన

నడచునే మదవార - ణమ్బువలెను?

పెద్దపిట్టను మేత - బెట్టి పెఞ్చిన గ్రొవ్వి

సాగునే వేటాడు - డేగవలెను?

తే. కుజనులను దెచ్చి నీ సేవ - కొఱకు బెట్ట

వాఞ్ఛతో జేతురే భక్త - వరులవలెను?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

060

సీ. నీకు దాసుడ నణ్టి - నిన్ను నమ్ముకయుణ్టి

గాన నాపై నేడు - కరుణజూడు

దోసిలొగ్గితి నీకు - ద్రోహ మెన్నగబోకు

పద్మలోచన । నేను - పరుడగాను

భక్తి నీపై నుఞ్చి - భజన జేసెద గాని

పరుల వేడను జుమ్మి - వరము లిమ్ము

దణ్డిదాతవు నీవు - తడవుసేయక కావు

ఘోరపాతకరాశి - గొట్టివైచి

తే. శీఘ్రముగ గోర్కు లీడేర్చు - చిన్త దీర్చు

నిరతముగ నన్ను బోషిఞ్చు - నెనరు నుఞ్చు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

061

సీ. విద్య నేర్చితి నఞ్చు - విర్రవీగగలేదు

భాగ్యవన్తుడ నఞ్చు - బలుకలేదు

ద్రవ్యవన్తుడ నఞ్చు - దఱచు నిక్కగలేదు

నిరతదానములైన - నెఱపలేదు

పుత్రవన్తుడ నఞ్చు - బొగడుచుణ్డగలేదు

భ్రుత్యవన్తుడ నఞ్చు - బొగడలేదు

శౌర్యవన్తుడ నఞ్చు - సన్తసిమ్పగలేదు

కార్యవన్తుడ నఞ్చు - గడపలేదు

తే. నలుగురికి మెప్పుగానైన - నడువలేదు

నలినదలనేత్ర । నిన్ను నే - నమ్మినాను.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

062

సీ. అతిలోభులను భిక్ష - మడుగబోవుట రోత

తనద్రవ్య మొకరిణ్ట - దాచ రోత

గుణహీను డగువాని - కొలువు గొల్చుట రోత

యొరుల పఞ్చలక్రిన్ద - నుణ్డ రోత

భాగ్యవన్తునితోడ - బన్తమాడుట రోత

గుఱిలేని బన్ధుల - గూడ రోత

ఆదాయములు లేక - యప్పుదీయుట రోత

జార చోరుల గూడి - చనుట రోత

తే. యాదిలక్ష్మీశ । నీబణ్ట - నైతినయ్య ।

యిఙ్క నెడబాసి జన్మమ్బు - లెత్త రోత.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

063

సీ. వెర్రివానికి నేల - వేదాక్షరమ్బులు?

మోటువానికి మఞ్చి - పాట లేల?

పసులకాపరి కేల - పరతత్త్వబోధలు?

విటకాని కేటికో - విష్ణుకథలు?

వదరు శుణ్ఠల కేల - వ్రాత పుస్తకములు?

తిరుగు ద్రిమ్మరి కేల - దేవపూజ?

ద్రవ్యలోభికి నేల - ధాతృత్వ గుణములు?

దొఙ్గబణ్టుకు మఞ్చి - సఙ్గ తేల?

తే. క్రూరజనులకు నీమీద - గోరి కేల?

ద్రోహి పాపాత్మునకు దయా - దుఃఖ మేల?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

064

సీ. నా తణ్డ్రి నాదాత - నాయిష్టదైవమా

నన్ను మన్ననసేయు - నారసింహ ।

దయయుఞ్చు నామీద - దప్పులన్ని క్షమిఞ్చు

నిగమగోచర । నాకు - నీవె దిక్కు

నే దురాత్ముడ నఞ్చు - నీమనమ్బున గోప

గిమ్పబోకుము స్వామి । - కేవలముగ

ముక్తిదాయక నీకు - మ్రొక్కినన్దుకు నన్ను

గరుణిఞ్చి రక్షిఞ్చు - కమలనాభ ।

తే. దణ్డిదొర వఞ్చు నీవెణ్ట - దగిలినాను

నేడు ప్రత్యక్షమై నన్ను - నిర్వహిమ్పు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

065

సీ. వేమాఱు నీకథల్ - వినుచు నుణ్డెడివాడు

పరుల ముచ్చటమీద - భ్రాన్తి పడడు

అగణితమ్బుగ నిన్ను - బొగడ నేర్చినవాడు

చెడ్డమాటలు నోట - జెప్పబోడు

ఆసక్తిచేత ని - న్ననుసరిఞ్చెడివాడు

ధనమదాన్ధులవెణ్ట - దగుల బోడు

సన్తసమ్బున నిన్ను - స్మరణజేసెడివాడు

చెలగి నీచులపేరు - దలపబోడు

తే. నిన్ను నమ్మిన భక్తుణ్డు - నిశ్చయముగ

గోరి చిల్లర వేల్పుల - గొల్వబోడు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

066

సీ. నే నెన్త వేడిన - నీ కేల దయరాదు?

పలుమాఱు పిలిచిన - బలుక వేమి?

పలికిన నీ కున్న - పద వేమిబోవు? నీ

మోమైన బొడచూప - వేమి నాకు?

శరణు జొచ్చినవాని - సవరిమ్పవలె గాక

పరిహరిఞ్చుట నీకు - బిరుదు గాదు

నీదాసులను నీవు - నిర్వహిమ్పక యున్న

బరు లెవ్వ రగుదురు - పఙ్కజాక్ష ।

తే. దాత దైవమ్బు తల్లియు - దణ్డ్రి వీవె

నమ్మియున్నాను నీపాద - నలినములను.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

067

సీ. వేదముల్ చదివెడు - విప్రవర్యుణ్డైన

రణము సాధిఞ్చెడు - రాజెయైన

వర్తకకృషికుడౌ - వైశ్యముఖ్యుణ్డైన

బరిచగిఞ్చెడు శూద్ర - వర్యుడయిన

మెచ్చుఖడ్గము బట్టి - మెఱయు మ్లేచ్ఛుణ్డైన

బ్రజల కక్కఱపడు - రజకుడైన

చర్మ మమ్మెడి హీన - చణ్డాలనరుడైన

నీ మహీతలమన్దు - నెవ్వడైన

తే. నిన్ను గొనియాడుచుణ్డెనా - నిశ్చయముగ

వాడు మోక్షాధికారి యీ - వసుధలోన.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

068

సీ. సకలవిద్యలు నేర్చి - సభ జయిమ్పగవచ్చు

శూరుడై రణమన్దు - బోరవచ్చు

రాజరాజై పుట్టి - రాజ్య మేలగవచ్చు

హేమ గోదానమ్బు - లియ్యవచ్చు

గగనమం దున్న చు - క్కల నెఞ్చగావచ్చు

జీవరాసుల పేల్లు - చెప్పవచ్చు

నష్టాఙ్గయోగము - లభ్యసిమ్పగవచ్చు

మేక రీతిగ నాకు - మెసవవచ్చు

తే. తామరసగర్భ హర పురం - దరులకైన

నిన్ను వర్ణిమ్ప దరమౌనె - నీరజాక్ష ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

069

సీ. నరసింహ । నీవణ్టి - దొరను సమ్పాదిఞ్చి

కుమతి మానవుల నే - గొల్వజాల

నెక్కు వైశ్వర్యమ్బు - లియ్యలేకున్నను

బొట్టకుమాత్రము - పోయరాదె?

ఘనముగా దిది నీకు - కరవున బోషిమ్ప

గష్ట మెన్తటి స్వల్ప - కార్యమయ్య?

పెట్టజాలక యేల - భిక్షమెత్తిఞ్చెదు

నన్ను బీదను జేసి - నా వదేమి?

తే. అమల । కమలాక్ష । నే నిట్లు - శ్రమపడఙ్గ

గన్నులకు బణ్డువై నీకు - గానబడునె?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

070

సీ. వనరుహనాభ । నీ - వఙ్క జేరితి నేను

గట్టిగా నను గావు - కావు మనుచు

వచ్చినన్దుకు వేగ - వరము లియ్యకకాని

లేవబోయిన నిన్ను - లేవనియ్య

గూర్చుణ్డబెట్టి నీ - కొఙ్గు గట్టిగ బట్టి

పుచ్చుకొన్దును జూడు - భోగిశయన ।

యీవేల నీ కడ్డ - మెవరు వచ్చినగాని

వారికైనను లొఙ్గి - వడకబోను

తే. గోపగాడను నీవు నా - గుణము తెలిసి

యిప్పుడే నన్ను రక్షిఞ్చి - యేలుకొమ్ము.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

071

సీ. ప్రహ్లాదు డేపాటి - పైడి కానుక లిచ్చె?

మదగజం బెన్నిచ్చె - మౌక్తికములు?

నారదుం డెన్నిచ్చె - నగలు రత్నమ్బు? ల

హల్య నీ కే యగ్ర - హార మిచ్చె?

ఉడుత నీ కేపాటి - యూడిగమ్బులు చేసె?

ఘనవిభీషణు డేమి - కట్న మిచ్చె?

పఞ్చపాణ్డవు లేమి - లఞ్చ మిచ్చిరి నీకు?

ద్రౌపది నీ కెన్త - ద్రవ్య మిచ్చె?

తే. నీకు వీరన్ద ఱయినట్లు - నేను గాన?

యెన్దు కని నన్ను రక్షిమ్ప - విన్దువదన ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

072

సీ. వాఞ్ఛతో బలిచక్ర - వర్తిదగ్గర జేరి

భిక్షమెత్తితి వేల - బిడియపడక?

యడవిలో శబరి ది - య్యని ఫలా లన్దియ్య

జేతులొగ్గితి వేల - సిగ్గుపడక?

వేడ్కతో వేవేగ - విదురునిణ్టికి నేగి

విన్దుగొణ్టి వదేమి - వెలితిపడక?

అడుకు లల్పము కుచే - లుడు గడిఞ్చుక తేర

బొక్కసాగితి వేల - లెక్కగొనక?

తే. భక్తులకు నీవు పెట్టుట - భాగ్యమౌను

వారి కాశిఞ్చితివి తిణ్డి - వాడ వగుచు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

073

సీ. స్తమ్భమం దుదయిఞ్చి - దానవేన్ద్రుని ద్రుఞ్చి

కరుణతో బ్రహ్లాదు - గాచినావు

మకరిచే జిక్కి సా - మజము దుఃఖిఞ్చఙ్గ

గృపయుఞ్చి వేగ ర - క్షిఞ్చినావు

శరణఞ్చు నా విభీ - షణుడు నీ చాటున

వచ్చినప్పుడె లఙ్క - నిచ్చినావు

ఆ కుచేలుడు చేరె - డటుకు లర్పిఞ్చిన

బహుసమ్పదల నిచ్చి - పమ్పినావు

తే. వారివలె నన్ను బోషిమ్ప - వశముగాదె?

యన్త వలపక్ష మేల శ్రీ - కాన్త । నీకు?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

074

సీ. వ్యాసు డే కులమన్దు - వాసిగా జన్మిఞ్చె?

విదురు డే కులమన్దు - వృద్ధి బొన్దె?

గర్ణు డేకులమన్దు - ఘనముగా వర్ధిల్లె?

నా వసిష్ఠుం డెన్దు - నవతరిఞ్చె?

నిమ్పుగా వాల్మీకి - యే కులమ్బున బుట్టె?

గుహు డను పుణ్యు డే - కులమువాడు?

శ్రీశుకు డెక్కట - జెలగి జన్మిఞ్చెను?

శబరి యేకులమన్దు - జన్మమొన్దె?

తే. నే కులమ్బున వీ రిన్ద - ఱెచ్చినారు?

నీకృపాపాత్రులకు జాతి - నీతు లేల?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

075

సీ. వసుధాస్థలమ్బున - వర్ణహీనుడు గాని

బహుల దురాచార - పరుడు గాని

తడసి కాసియ్యని - ధర్మశూన్యుడు గాని

చదువనేరని మూఢ - జనుడు గాని

సకలమానవులు మె - చ్చని కృతఘ్నుడు గాని

చూడ సొమ్పును లేని - శుణ్ఠ గాని

అప్రతిష్ఠలకు లో - నైన దీనుడు గాని

మొదటి కే మెఱుగని - మోటు గాని

తే. ప్రతిదినము నీదు భజనచే - బరగునట్టి

వాని కే వఙ్క లేదయ్య - వచ్చు ముక్తి.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

076

సీ. ఇభకుమ్భములమీది - కెగిరెడి సిఙ్గమ్బు

ముట్టునే కుఱుచైన - మూషకమును?

నవచూతపత్రముల్ - నమలుచున్న పికమ్బు

గొఱుకునే జిల్లేడు - కొనలు నోట?

అరవిన్దమకరన్ద - మనుభవిఞ్చెడి తేటి

పోవునే పల్లేరు - పూలకడకు?

లలిత మైన రసాల - ఫలము గోరెడి చిల్క

మెసవునే భమత ను - మ్మెత్తకాయ?

తే. నిలను నీకీర్తనలు పాడ - నేర్చినతడు

పరులకీర్తన బాడునే - యరసి చూడ?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

077

సీ. సర్వేశ । నీపాద - సరసిజద్వయమన్దు

జిత్త ముమ్పగలేను - జెదరకుణ్డ

నీవైన దయయుఞ్చి - నిలిచి యుణ్డెడునట్లు

చేరి నన్నిపు డేలు - సేవకుడను

వనజలోచన । నేను - వట్టి మూర్ఖుడ జుమ్మి

నీస్వరూపము జూడ - నేర్పు వేగ

తన కుమారున కుగ్గు - తల్లి వోసినయట్లు

భక్తిమార్గం బను - పాలు పోసి

తే. ప్రేమతో నన్ను బోషిఞ్చి - పెఞ్చుకొనుము

ఘనత కెక్కిఞ్చు నీదాస - గణములోన.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

078

సీ. జీమూతవర్ణ । నీ - మోముతో సరిరాక

కమలారి యతికలం - కమును బడసె

సొగసైన నీ నేత్ర - యుగముతో సరిరాక

నలినబృన్దము నీల్ల - నడుమ జేరె

గరిరాజవరద । నీ - గలముతో సరిరాక

పెద్దశఙ్ఖము బొబ్బ - పెట్ట బొడగె

శ్రీపతి । నీదివ్య - రూపుతో సరి రాక

పుష్పబాణుడు నీకు - బుత్రు డయ్యె

తే. నిన్దిరాదేవి నిన్ను మో - హిఞ్చి విడక

నీకు బట్టమహిషి యయ్యె - నిశ్చయముగ.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

079

సీ. హరిదాసులను నిన్ద - లాడకుణ్డిన జాలు

సకల గ్రన్థమ్ములు - చదివినట్లు

భిక్ష మియ్యఙ్గ ద - ప్పిమ్పకుణ్డిన జాలు

జేముట్టి దానమ్బు - చేసినట్లు

మిఞ్చి సజ్జనుల వం - చిఞ్చకుణ్డిన జాలు

నిమ్పుగా బహుమాన - మిచ్చినట్లు

దేవాగ్రహారముల్ - దీయకుణ్డిన జాలు

గనకకమ్బపు గుల్లు - గట్టినట్లు

తే. ఒకరి వర్శాశనము ముఞ్చ - కున్న జాలు

బేరుకీర్తిగ సత్రముల్ - పెట్టినట్లు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

080

సీ. ఇహలోకసౌఖ్యము - లిచ్చగిఞ్చెద మన్న

దేహ మెప్పటికి దా - స్థిరత నొన్ద

దాయుష్య మున్న ప - ర్యన్తమ్బు పటుతయు

నొక్కతీరున నుణ్డ - దుర్విలోన

బాల్యయువత్వదు - ర్బలవార్ధకము లను

మూటిలో మునిగెడి - ముఱికికొమ్ప

భ్రాన్తితో దీని గా - పాడుద మనుమొన్న

గాలమృత్యువుచేత - గోలుపోవు

తే. నమ్మరా దయ్య । యిది మాయ - నాటకమ్బు

జన్మ మిక నొల్ల న న్నేలు - జలజనాభ ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

081

సీ. వదనమ్బు నీనామ - భజన గోరుచునుణ్డు

జిహ్వ నీకీర్తనల్ - సేయ గోరు

హస్తయుగ్మమ్బు ని - న్నర్చిమ్ప గోరును

గర్ణముల్ నీ మీది - కథలు గోరు

తనువు నీసేవయే - ఘనముగా గోరును

నయనముల్ నీదర్శ - నమ్బు గోరు

మూర్ధమ్ము నీపద - మ్ముల మ్రొక్కగా గోరు

నాత్మ నీదై యుణ్డు - నరసి చూడ

తే. స్వప్నమున నైన నేవేల - సన్తతమును

బుద్ధి నీ పాదములయన్దు - బూనియుణ్డు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

082

సీ. పద్మాక్ష । మమతచే - బరము నన్దెద మఞ్చు

విర్రవీగుదుమయ్య - వెర్రిపట్టి

మాస్వతన్త్రమ్బైన - మదము గణ్డ్లకు గప్పి

మొగము పట్టదు కామ - మోహమునను

బ్రహ్మదేవుణ్డైన - బైడిదేహము గల్గ

జేసివేయక మమ్ము - జెఱిచె నతడు

తుచ్ఛమైనటువణ్టి - తో లెమ్ముకలతోడి

ముఱికి చెత్తలు చేర్చి - మూట కట్టె

తే. నీ శరీరాలు పడిపోవు - టెఱుగ కేము

కాముకుల మైతి మిక మిమ్ము - గానలేము.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

083

సీ. గరుడవాహన । దివ్య - కౌస్తుభాలఙ్కార ।

రవికోటితేజ । సా - రఙ్గవదన ।

మణిగణాన్విత । హేమ - మకుటాభరణ । చారు

మకరకుణ్డల । లస - న్మన్దహాస ।

కాఞ్చనామ్బర । రత్న - కాఞ్చివిభూషిత ।

సురవరార్చిత । చన్ద్ర - సూర్యనయన ।

కమలనాభ । ముకున్ద । - గఙ్గాధరస్తుత ।

రాక్షసాన్తక । నాగ - రాజశయన ।

తే. పతితపావన । లక్షీశ । - బ్రహ్మజనక ।

భక్తవత్సల । సర్వేశ । - పరమపురుష ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

084

సీ. పలుమాఱు దశరూప - ములు దరిఞ్చితి వేల?

యేకరూపము బొన్ద - వేల నీవు?

నయమున క్షీరాబ్ధి - నడుమ జేరితి వేల?

రత్నకాఞ్చన మన్ది - రములు లేవె?

పన్నగేన్ద్రునిమీద - బవ్వలిఞ్చితి వేల?

జలతారుపట్టెమం - చములు లేవె?

ఱెక్కలు గలపక్షి - నెక్కసాగితి వేల?

గజతురఙ్గాన్దోలి - కములు లేవె?

తే. వనజలోచన । యిటువణ్టి - వైభవములు

సొగసుగా నీకు దోచెనో - సున్దరాఙ్గ?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

085

సీ. తిరుపతి స్థలమన్దు - దిన్నగా నే నున్న

వేఙ్కటేశుడు మేత - వేయలేడొ?

పురుషోత్తమమున కే - బోయనజాలు జ

గన్నాథు డన్నమ్బు - గడపలేడొ?

శ్రీరఙ్గమునకు నే - జేర బోయిన జాలు

స్వామి గ్రాసము బెట్టి - సాకలేడొ?

కాఞ్చీపురములోన - గదిసి నే గొలువున్న

గరివరదుడు పొట్ట - గడపలేడొ?

తే. యెన్దు బోవక నేను నీ - మన్దిరమున

నిలిచితిని నీకు నామీద - నెనరు లేదు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

086

సీ. తార్క్ష్యవాహన । నీవు - దణ్డిదాత వటఞ్చు

గోరి వేడుక నిన్ను - గొల్వవచ్చి

యర్థిమార్గమును నే - ననుసరిఞ్చితినయ్య

లావైన బదునాల్గు - లక్ష లైన

వేషముల్ వేసి నా - విద్యాప్రగల్భత

జూపసాగితి నీకు - సున్దరాఙ్గ ।

యానన్ద మైన నే - నడుగ వచ్చిన దిచ్చి

వాఞ్ఛ దీర్పుము - నీలవర్ణ । వేగ

తే. నీకు నావిద్య హర్షమ్బు - గాక యున్న

తేపతేపకు వేషముల్ - దేను సుమ్మి.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

087

సీ. అమరేన్ద్రవినుత । నే - నతిదురాత్ముడ నఞ్చు

గలలోన నైనను - గనుల బడవు

నీవు ప్రత్యక్షమై - నులువకుణ్డిన మానె

దొడ్డగా నొక యుక్తి - దొరకెనయ్య ।

గట్టికొయ్యను దెచ్చి - ఘనముగా ఖణ్డిఞ్చి

నీస్వరూపము చేసి - నిలుపుకొఞ్చు

ధూప దీపము లిచ్చి - తులసితో బూజిఞ్చి

నిత్యనైవేద్యముల్ - నేమముగను

తే. నడుపుచును నిన్ను గొలిచెద - నమ్మి బుద్ధి

నీ ప్రపఞ్చమ్బు గలుగు నా - కిన్తె చాలు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

088

సీ. భువనేశ । గోవిన్ద । - రవికోటిసఙ్కాశ ।

పక్షివాహన । భక్త - పారిజాత ।

యమ్భోజభవ రుద్ర - జమ్భారిసన్నుత ।

సామగానవిలోల । - సారసాక్ష ।

వనధిగమ్భీర । శ్రీ - వత్సకౌస్తుభవక్ష ।

శఙ్ఖచక్రగదాసి - శార్జ్ఞహస్త ।

దీనరక్షక । వాసు - దేవ । దైత్యవినాశ ।

నారదార్చిత । దివ్య - నాగశయన ।

తే. చారు నవరత్నకుణ్డల - శ్రవణయుగల ।

విబుధవన్దిత పాదబ్జ । - విశ్వరూప ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

089

సీ. నాగేన్ద్రశయన । నీ - నామమాధుర్యమ్బు

మూడుకన్నుల సామ్బ - మూర్తి కెఱుక

పఙ్కజాతాక్ష । నీ - బలపరాక్రమ మెల్ల

భారతీపతి యైన - బ్రహ్మ కెఱుక

మధుకైటభారి । నీ - మాయాసమర్థత

వసుధలో బలిచక్ర - వర్తి కెఱుక

పరమాత్మ । నీ దగు - పక్షపాతిత్వమ్బు

దశశతాక్షుల పురం - దరుని కెఱుక

తే. వీరి కెఱుకగు నీకథల్ - విన్త లెల్ల

నరుల కెఱు కన్న నెవరైన - నవ్విపోరె?

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

090

సీ. అర్థు లేమైన ని - న్నడుగవచ్చెద రఞ్చు

క్షీరసాగరమన్దు - జేరినావు

నీచుట్టు సేవకుల్ - నిలువకుణ్డుటకునై

భయదసర్పముమీద - బణ్డినావు

భక్తబృన్దము వెణ్ట - బడి చరిఞ్చెద రఞ్చు

నెగసి పోయెడిపక్షి - నెక్కినావు

దాసులు నీద్వార - మాసిమ్పకుణ్టకు

మఞ్చి యోధుల కావ - లుఞ్చినావు

తే. లావు గలవాడ వైతి వే - లాగు నేను

నిన్ను జూతును నాతణ్డ్రి । - నీరజాక్ష ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

091

సీ. నీకథల్ చెవులలో - సోకుట మొదలుగా

బులకాఙ్కురము మెన - బుట్టువాడు

నయమైన నీ దివ్య - నామకీర్తనలోన

మగ్నుడై దేహమ్బు - మఱచువాడు

ఫాలమ్బుతో నీదు - పాదయుగ్మమునకు

బ్రేమతో దణ్డ మ - ర్పిఞ్చువాడు

హా పుణ్డరీకాక్ష । - హా రామ । హరి । యఞ్చు

వేడ్కతో గేకలు - వేయువాడు

తే. చిత్తకమలమ్బునను నిన్ను - జేర్చువాడు

నీదులోకమ్బునం దుణ్డు - నీరజాక్ష ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

092

సీ. నిగమగోచర । నేను - నీకు మెప్పగునట్లు

లెస్సగా బూజిమ్ప - లేను సుమ్మి

నాకు దోచిన భూష - ణములు పెట్టెద నన్న

గౌస్తుభమణి నీకు - గలదు మున్దె

భక్ష్యభోజ్యముల న - ర్పణము జేసెద నన్న

నీవు పెట్టితి సుధ - నిర్జరులకు

గలిమికొద్దిగ గాను - కల నొసఙ్గెద నన్న

భార్గవీదేవి నీ - భార్య యయ్యె

తే. నన్ని గలవాడ వఖిల లో - కాధిపతివి ।

నీకు సొమ్ములు పెట్ట నే - నెన్తవాడ ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

093

సీ. నవసరోజదలాక్ష । - నన్ను బోషిఞ్చెడు

దాతవు నీ వఞ్చు - ధైర్యపడితి

నా మనమ్బున నిన్ను - నమ్మినన్దుకు దణ్డ్రి ।

మేలు నా కొనరిమ్పు - నీలదేహ ।

భలిభలీ । నీ యన్త - ప్రభువు నెక్కడ జూడ

బుడమిలో నీ పేరు - పొగడవచ్చు

మున్దు జేసిన పాప - మును నశిమ్పగ జేసి

నిర్వహిమ్పుము నన్ను - నేర్పుతోడ

తే. బరమసన్తోష మాయె నా - ప్రాణములకు

నీ​ఋణము దీర్చుకొన నేర - నీరజాక్ష ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

094

సీ. ఫణులపుట్టలమీద - బవ్వలిఞ్చినయట్లు

పులుల గుమ్పున జేర - బోయినట్లు

మకరివర్గం బున్న - మడుగు జొచ్చినయట్లు

గఙ్గదాపున నిణ్డ్లు - గట్టినట్లు

చెదలభూమిని జాప - చేర బఱచినయట్లు

ఓటిబిన్దెల బాల - నునిచినట్లు

వెర్రివానికి బహు - విత్త మిచ్చినయట్లు

కమ్మగుడిసె మన్దు - గాల్చినట్లు

తే. స్వామి నీ భక్తవరులు దు - ర్జనులతోడ

జెలిమి జేసినయ ట్లైన - జేటు వచ్చు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

095

సీ. దనుజసంహార । చక్ర - ధర । నీకు దణ్డమ్బు

లిన్దిరాధిప । నీకు - వన్దనమ్బు

పతితపావన । నీకు - బహునమస్కారముల్

నీరజాతదలాక్ష । - నీకు శరణు

వాసవార్చిత । మేఘ - వర్ణ । నీకు శుభమ్బు

మన్దరధర । నీకు - మఙ్గలమ్బు

కమ్బుకన్ధర । శార్జ్గ - కర । నీకు భద్రమ్బు

దీనరక్షక । నీకు - దిగ్విజయము

తే. సకలవైభవములు నీకు - సార్వభౌమ ।

నిత్యకల్యాణములు నగు - నీకు నెపుడు.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

096

సీ. మత్స్యావతార మై - మడుగులోపల జొచ్చి

సోమకాసురు ద్రుఞ్చి - చోద్యముగను

దెచ్చి వేదము లెల్ల - మెచ్చ దేవతలెల్ల

బ్రహ్మ కిచ్చితి వీవు - భలి । యనఙ్గ

నా వేదముల నియ్య - నాచారనిష్ఠల

ననుభవిఞ్చుచు నున్దు - రవనిసురులు

సకలపాపమ్బులు - సమసిపోవు నటఞ్చు

మనుజు లన్దఱు నీదు - మహిమ దెలిసి

తే. యున్దు రరవిన్దనయన । నీ - యునికి దెలియు

వారలకు వేగ మోక్షమ్బు - వచ్చు ననఘ ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

097

సీ. కూర్మావతారమై - కుధరమ్బుక్రిన్దను

గోర్కితో నుణ్డవా - కొమరు మిగుల?

వరహావతారమై - వనభూములను జొచ్చి

శిక్షిమ్పవా హిర - ణ్యాక్షు నపుడు?

నరసింహమూర్తివై - నరభోజను హిరణ్య

కశిపుని ద్రుమ్పవా - కాన్తి మీఱ?

వామనరూపమై - వసుధలో బలిచక్ర

వర్తి నఱమ్పవా - వైర ముడిగి?

తే. యిట్టి పను లెల్ల జేయగా - నెవరికేని

తగునె నరసింహ । నీకిది - దగును గాక ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

098

సీ. లక్ష్మీశ । నీదివ్య - లక్షణగుణముల

వినజాల కెప్పుడు - వెర్రినైతి

నా వెర్రిగుణములు - నయముగా ఖణ్డిఞ్చి

నన్ను రక్షిమ్పు మో - నలిననేత్ర ।

నిన్ను నే నమ్మితి - నితరదైవముల నే

నమ్మలే దెప్పుడు - నాగశయన ।

కాపాడినను నీవె - కష్టపెట్టిన నీవె

నీపాదకమలముల్ - నిరత మేను

తే. నమ్మియున్నాను నీపాద - నలినభక్తి

వేగ దయచేసి రక్షిమ్పు - వేదవిద్య ।

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

099

సీ. అమరేన్ద్రవినుత । ని - న్ననుసరిఞ్చినవారు

ముక్తి బొన్దిరి వేగ - ముదముతోను

నీపాదపద్మముల్ - నెఱ నమ్మియున్నాను

నాకు మోక్షం బిమ్ము - నలిననేత్ర ।

కాచి రక్షిఞ్చు నన్ - గడతేర్చు వేగమే

నీ సేవకుని జేయు - నిశ్చలముగ

గాపాడినను నీకు - గైఙ్కర్యపరుడ నై

చెలగి నీపనులను - జేయువాడ

తే. ననుచు బలుమాఱు వేడెద - నబ్జనాభ ।

నాకు బ్రత్యక్ష మగుము నిన్ - నమ్మినాను.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

100

సీ. శేషప్ప యను కవి - చెప్పిన పద్యముల్

చెవుల కానన్దమై - చెలగుచుణ్డు

నే మనుజుణ్డైన - నెలమి నీ శతకమ్బు

భక్తితో విన్న స - త్ఫలము గలుగు

జెలగి యీ పద్యముల్ - చేర్చి వ్రాసినవారు

కమలాక్షుకరుణను - గాన్తు రెపుడు

నిమ్పుగా బుస్తకం - బెపుడు బూజిఞ్చిన

దురితజాలమ్బులు - దొలగిపోవు

తే. నిద్ది పుణ్యాకరం బని - యెపుడు జనులు

గషట మెన్నక పఠియిమ్ప - గలుగు ముక్తి.

భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।

దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

About This Stotram

Overview

The Narasimha Satakam is a Sanskrit stotram consisting of one hundred verses dedicated to Lord Narasimha, the man-lion avatar of Vishnu. The satakam format allows for a systematic glorification of the deity's attributes, exploits, and protective powers across its verses. The text belongs to the Vaishnava tradition and centers on Narasimha's role as the destroyer of the demon Hiranyakashipu and the protector of Prahlada.

What are the benefits of chanting Narasimha Satakam?

  • Invokes the protective power of Narasimha against enemies and hostile forces
  • Aids in removing fear and obstacles
  • Builds courage and inner strength through meditation on the deity's fierce form
  • Supports spiritual progress within the Vaishnava devotional path

When is the best time to recite this?

The Narasimha Satakam is recited in the morning and evening, with Narasimha Jayanti being the most auspicious occasion for a full recitation. It is also chanted during times of distress or when facing significant personal challenges.

What is the historical and traditional background?

The authorship of this Narasimha Satakam is not attributed to any specific individual, and its precise date of composition is unknown. Satakam compositions — collections of one hundred Sanskrit verses — have a long history as a devotional literary form in India. Narasimha worship is attested in the Puranas, particularly the Bhagavata Purana and the Narasimha Purana, and stotrams dedicated to him have been composed by saints and scholars across many centuries. The text is recited in Vaishnava communities throughout India.

Available scripts

This text is available in 14 scripts: devanagari, tamil, telugu, kannada, malayalam, gujarati, bengali, iast, gurmukhi, oriya, assamese, sinhala, itrans, hk. Use the script selector above to switch between them.

Related Texts

  • Narasimha Kavacham — a protective armor hymn for the same deity, complementing the praise-focused satakam
  • Lakshmi Narasimha Karavalambana Stotram — a hymn seeking the combined grace of Lakshmi and Narasimha, widely recited in the same tradition
నారసింహ శతకమ్ | Lyrics in Telugu | Vedic Tithi