Maa Telugu Talliki Malle Poodanda
మా తెలుగు తల్లికి మల్లె పూదణ్డ
Maa Telugu Talliki Malle Poodanda
Stotram
Unknown
0 Verses
110%
మా తెలుగు తల్లికి మల్లె పూదణ్డ
శ్లోక 1
మా తెలుగు తల్లికి మల్లెపూదణ్డ
మా కన్న తల్లికి మఙ్గలారతులు
కడుపులో బఙ్గారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలిఞ్చు మాతల్లి
గల గలా గోదారి కదలి పోతుణ్టేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుణ్టేను
బఙ్గారు పణ్టలే పణ్డుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొన్తులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యన్దనాలు
నిత్యమై, నిఖిలమై నిలచియుణ్డేదాక
రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రిఙ్గుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
