Stotram - Sacred Scripture in telugu

Desamunu Preminchumanna

దేశమును ప్రేమిఞ్చుమన్న

Desamunu Preminchumanna

Stotram
Unknown
0 Verses
110%

దేశమును ప్రేమిఞ్చుమన్న

శ్లోక 1

దేశమును ప్రేమిఞ్చుమన్నా

మఞ్చి అన్నది పెఞ్చుమన్నా

వట్టి మాటలు కట్టిపెట్టోయ్

గట్టి మేల్ తలపెట్టవోయ్ !

పాడిపణ్టలుపొఙ్గి పొర్లే

దారిలో నువు పాటు పడవోయ్

తిణ్డి కలిగితె కణ్డ కలదోయ్

కణ్డ కలవాడేను మనిషోయ్ !

ఈసురోమని మనుషులుణ్టే

దేశ మేగతి బాగుపడునోయ్

జల్డుకొని కలలెల్ల నేర్చుకు

దేశి సరుకులు నిఞ్చవోయ్ !

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్

దేశి సరుకులు నమ్మవెలె నోయ్

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సమ్పద లబ్బవోయ్ !

వెనుక చూసిన కార్యమేమోయ్

మఞ్చిగతమున కొఞ్చమేనోయ్

మన్దగిఞ్చక మున్దు అడుగేయ్

వెనుక పడితే వెనుకేనోయ్ !

పూను స్పర్దను విద్యలన్దే

వైరములు వాణిజ్య మన్దే

వ్యర్ధ కలహం పెఞ్చబోకోయ్

కత్తి వైరం కాల్చవోయ్ !

దేశాభిమానము నాకు కద్దని

వట్టి గొప్పలు చెప్పకోకోయ్

పూని యేదైనాను, వొక మేల్

కూర్చి జనులకు చూపవోయ్ !

ఓర్వలేమి పిశాచి దేశం

మూలుగులు పీల్చేసె నోయ్

ఒరుల మేలుకు సన్తసిస్తూ

ఐకమత్యం నేర్చవోయ్

పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయ్

ఒకరి మేల్ తన మేలనెఞ్చే

నేర్పరికి మేల్ కొల్ల లోయి !

సొన్త లాభం కొన్త మానుకు

పొరుగువాడికి తోడు పడవోయ్

దేశమణ్టే మట్టికాదోయి

దేశమణ్టే మనుషులోయ్ !

చెట్ట పట్టాల్ పట్టుకుని

దేశస్తు లన్తా నడవవలె నోయ్

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నీ మెలగవలె నోయి !

మతం వేరైతేను యేమోయి

మనసు వొకటై మనుషులుణ్టే

జాతియన్నది లేచి పెరిగీ

లోకమున రాణిఞ్చు నోయి !

దేశ మనియెడి దొడ్డ వృక్షం

ప్రేమలను పూలెత్తవలె నోయ్

నరుల చెమటను తడిసి మూలం

ధనం పణ్టలు పణ్డవలె నోయి !

ఆకులన్దున అణగి మణగీ

కవిత పలకవలె నోయ్

పలుకులను విని దేశమన్దభి

మానములు మొలకెత్త వలెనోయి !