Annamayya Keerthanas Vinaro Bhagyamu
అన్నమయ్య కీర్తన వినరో భాగ్యము
Annamayya Keerthanas Vinaro Bhagyamu
Stotram
Unknown
0 Verses
110%
అన్నమయ్య కీర్తన వినరో భాగ్యము
శ్లోక 1
రాగం: శుద్ధ ధన్యాసి
ఆ: గ2 మ1 ప ని2 ప స
అవ: స ని2 ప మ1 గ2 స
తాలం: ఆది
పల్లవి
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ ॥ (2.5)
చరణం 1
ఆది నుణ్డి సన్ధ్యాది విధులలో
వేదమ్బయినది విష్ణుకథ । (2)
నాదిఞ్చీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ । (2.5)
వినరో భాగ్యము... (1.5)
చరణం 2
వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ । (2)
సదనమ్బైనది సఙ్కీర్తనయై (2)
వెదకినచోటనే విష్ణుకథ ॥ (1)
వినరో భాగ్యము... (1.5)
చరణం 3
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ । (2)
ఇల్లిదె శ్రీ వేఙ్కటేశ్వరు నామము
వెల్లగొలిపె నీ విష్ణుకథ ॥ (2.5)
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ ॥ (2.5)
