Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Pidikita Talambraala

అన్నమయ్య కీర్తన పిడికిట తలమ్బ్రాల

Annamayya Keerthanas Pidikita Talambraala

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన పిడికిట తలమ్బ్రాల

శ్లోక 1

రాగం: మధ్యామావతి

(పెద తిరు

ఆ: స రి2 మ1 ప ని2 స

అవ: స ని2 ప మ1 రి2 స

తాలం: ఆది

పల్లవి

పిడికిట తలమ్బ్రాల పెణ్డ్లి కూతురు కొన్త ।

పడమరలి నవ్వీనె పెణ్డ్లి కూతురు ॥ (2)

చరణం 1

పేరుకల జవరాలె పెణ్డ్లి కూతురు పెద్ద ।

పేరుల ముత్యాల మేడ పెణ్డ్లి కూతురు । (2)

పేరణ్టాణ్డ్ల నడిమి పెణ్డ్లి కూతురు । (2)

విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెణ్డ్లి కూతురు ॥

పిడికిట తలమ్బ్రాల పెణ్డ్లి కూతురు కొన్త..(ప..)(2)

చరణం 2

బిరుదు పెణ్డము వెట్టె బెణ్డ్లి కూతురు ।

నెర బిరుదు మగని కణ్టె బెణ్డ్లి కూతురు ।

పిరిదూరి నప్పుడే పెణ్డ్లి కూతురూ ।

పతి బెరరేచీ నిదివో పెణ్డ్లి కూతురు ॥

పిడికిట తలమ్బ్రాల పెణ్డ్లి కూతురు కొన్త..(ప..)

చరణం 3

పెట్టెనే పెద్ద తురుము పెణ్డ్లి కూతురు ।

నేడె పెట్టెడు చీరలు గట్టి పెణ్డ్లి కూతురు ।

గట్టిగ వేఙ్కటపతి కౌగిటను ।

పెట్టిన నిధానమయిన పెణ్డ్లి కూతురు ॥

పిడికిట తలమ్బ్రాల పెణ్డ్లి కూతురు కొన్త

పడమరలి నవ్వీనె పెణ్డ్లి కూతురు ॥