Annamayya Keerthanas Ksheerabdi Kanyakaku
అన్నమయ్య కీర్తన క్షీరాబ్ధి కన్యకకు
Annamayya Keerthanas Ksheerabdi Kanyakaku
Stotram
Unknown
0 Verses
110%
అన్నమయ్య కీర్తన క్షీరాబ్ధి కన్యకకు
శ్లోక 1
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం ॥
జలజాక్షి మోమునకు జక్కవ కుచమ్బులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం ।
అలివేణి తురుమునకు హస్తకమలమ్బులకు
నిలువుమాణిక్యముల నీరాజనం ॥
చరణ కిసలయములకు సకియరమ్భోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం ।
అరిది జఘనమ్బునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ॥
పగటు శ్రీవేఙ్కటేశు పట్టపురాణియై
నెగడు సతికలలకును నీరాజనం ।
జగతి నలమేల్మఙ్గ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం ॥
