Annamayya Keerthanas Kondalalo Nelakonna
అన్నమయ్య కీర్తన కొణ్డలలో నెలకొన్న
Annamayya Keerthanas Kondalalo Nelakonna
అన్నమయ్య కీర్తన కొణ్డలలో నెలకొన్న
శ్లోక 1
రాగం: హిన్దోలమ్ (20 నటభైరవి జన్య)
ఆ: స గ2 మ1 ద1 ని2 స
అవ: స ని2 ద1 మ1 గ2 స
తాలం: ఆది
పల్లవి
కొణ్డలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొణ్డలన్త వరములు గుప్పెడు వాడు ॥ (2.5)
చరణం 1
కుమ్మర దాసుడైన కురువరతి నమ్బి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు । (1)
దొమ్ములు సేసిన యట్టి తొణ్డమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ॥ (2.5)
కొణ్డలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు (ప.)
కొణ్డలన్త వరములు గుప్పెడు వాడు ॥ (ప.)(2.5)
చరణం 2
అచ్చపు వేడుకతోడ ననన్తాల్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు ।
మచ్చిక దొలక తిరునమ్బి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ॥
చరణం 3
కఞ్చిలోన నుణ్డ దిరుకచ్చినమ్బి మీద
కరుణిఞ్చి తన యెడకు రప్పిఞ్చిన వాడు । (2)
యెఞ్చి ఎక్కుడైన వేఙ్కటేశుడు మనలకు
మఞ్చివాడై కరుణ బాలిఞ్చిన వాడు ॥ (2.5)
కొణ్డలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు (ప.)
కొణ్డలన్త వరములు గుప్పెడు వాడు (ప.) (2.5)
