Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Kattedura Vaikuntham

అన్నమయ్య కీర్తన కట్టెదుర వైకుణ్ఠము

Annamayya Keerthanas Kattedura Vaikuntham

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన కట్టెదుర వైకుణ్ఠము

శ్లోక 1

కట్టెదుర వైకుణ్ఠము కాణాచయిన కొణ్డ

తెట్టరాయ మహిమలే తిరుమల కొణ్డ ॥

వేదములే శిలలై వెలసినది కొణ్డ

యేదెస బుణ్యరాసులే యేరులైనది కొణ్డ ।

గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొణ్డ

శ్రీదేవు డుణ్డేటి శేషాద్రి కొణ్డ ॥

సర్వదేవతలు మృగజాతులై చరిఞ్చే కొణ్డ

నిర్వహిఞ్చి జలధులే నిట్టచరులైన కొణ్డ ।

వుర్వి దపసులే తరువులై నిలచిన కొణ్డ

పూర్వ టఞ్జనాద్రి యీ పొడవాటి కొణ్డ ॥

వరములు కొటారుగా వక్కాణిఞ్చి పెఞ్చే కొణ్డ

పరగు లక్ష్మీకాన్తు సోబనపు గొణ్డ ।

కురిసి సమ్పదలెల్ల గుహల నిణ్డిన కొణ్డ

విరివైన దదివో శ్రీ వేఙ్కటపు గొణ్డ ॥