Annamayya Keerthanas Jaya Lakshmi Vara Lakshmi
అన్నమయ్య కీర్తన జయ లక్ష్మి వర లక్ష్మి
Annamayya Keerthanas Jaya Lakshmi Vara Lakshmi
అన్నమయ్య కీర్తన జయ లక్ష్మి వర లక్ష్మి
శ్లోక 1
రాగం: లలిత
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స
తాలం: రూపక
పల్లవి
జయలక్ష్మి వరలక్ష్మి సఙ్గ్రామ వీరలక్ష్మి । (2)
ప్రియురాలవై హరికి~మ బెరసితివమ్మా ॥ (2)
చరణం 1
పాలజలనిధిలోని పసనైనమీఁగడ (5)+(1)
మేలిమితామరలోని మిఞ్చువాసన ।
నీలవర్ణునురముపై నిణ్డిననిధానమవై (2)
యేలేవు లోకములు మమ్మేలవమ్మా ॥
జయలక్ష్మి వరలక్ష్మి సఙ్గ్రామ వీరలక్ష్మి । (ఫా..)
చరణం 2
చన్దురుతోడ~మ బుట్టిన సమ్పదలమెఱుఁగవో
కన్దువ బ్రహ్మల~మ గాచేకల్పవల్లి ।
అన్దినగోవిన్దునికి అణ్డనే తోడునీడవై
వున్దానవు మాఇణ్టనే వుణ్డవమ్మా ॥
జయలక్ష్మి వరలక్ష్మి సఙ్గ్రామ వీరలక్ష్మి । (ఫా..)
చరణం 3
పదియారు వన్నెలతో బఙ్గారు పతిమ (5)+(1)
చెదరని వేదముల చిగురుఁబోడి ।
యెదుట శ్రీవేఙ్కటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ॥
జయలక్ష్మి వరలక్ష్మి సఙ్గ్రామ వీరలక్ష్మి । (ఫా..)
ప్రియురాలవై హరికి~మ బెరసితివమ్మా ॥ (2)