Annamayya Keerthanas Jagadapu Chanuvula
అన్నమయ్య కీర్తన జగడపు చనువుల
Annamayya Keerthanas Jagadapu Chanuvula
Stotram
Unknown
0 Verses
110%
అన్నమయ్య కీర్తన జగడపు చనువుల
శ్లోక 1
జగడపు చనువుల జాజర
సగినల మఞ్చపు జాజర ॥
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున ।
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ॥
భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గన్ధవొడి ।
చేరువ పతిపై చిన్దగ పడతులు
సారెకు చల్లేరు జాజర ॥
బిఙ్కపు కూటమి పెనగేటి చెమటల
పఙ్కపు పూతల పరిమలము ।
వేఙ్కటపతిపై వెలదులు నిఞ్చేరు
సఙ్కుమ దమ్బుల జాజర ॥
