Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Alara Chanchalamaina

అన్నమయ్య కీర్తన అలర చఞ్చలమైన

Annamayya Keerthanas Alara Chanchalamaina

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన అలర చఞ్చలమైన

శ్లోక 1

రాగమ్: రాగ మాలికా / నీలామ్బరి

ఆ: స రి2 గ3 మ1 ప ద2 ప ని3 స

అవ: స ని3 ప మ1 గ3 రి2 గ3 స

తాలం: ఖణ్డ చాపు

పల్లవి

అలర చఞ్చలమైన ఆత్మలన్దుణ్డ నీ యలవాటు చేసె నీ వుయ్యాల ।

పలుమారు నుచ్ఛ్వాస పవనమన్దుణ్డ నీ భావమ్బు దెలిపె నీ వుయ్యాల ॥ (1.5)

చరణం 1

ఉదాయాస్త శైలమ్బు లొనర కమ్భములైన వుడుమణ్డలము మోచె నుయ్యాల ।

అదన ఆకాశపదము అడ్డౌదూలమ్బైన అఖిలమ్బు నిణ్డె నీ వుయ్యాల ॥ (1.5)

చరణం 2

పదిలముగ వేదములు బఙ్గారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల ।

వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణిమ్ప నరుదాయె వుయ్యాల ॥ (1.5)

చరణం 3

మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల ।

నీల శైలమువణ్టి నీ మేనికాన్తికి నిజమైన తొడవాయె వుయ్యాల ॥ (1.5)

అలర చఞ్చలమైన ఆత్మలన్దుణ్డ నీ యలవాటు చేసె నీ వుయ్యాల ।

పలుమారు నుచ్ఛ్వాస పవనమన్దుణ్డ నీ భావమ్బు దెలిపె నీ వుయ్యాల ॥ (ప.) (1.5)

చరణం 4

పాలిణ్డ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల ।

వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ॥

చరణం 5

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలిమ్పగజేసె నుయ్యాల ।

అమరాఙ్గనలకు నీ హాస భావ విలాస మన్దన్ద చూపె నీ వుయ్యాల ॥

చరణం 6

కమలాసనాదులకు కన్నుల పణ్డుగై గణుతిమ్ప నరుదాయె వుయ్యాల ।

కమనీయ మూర్తి వేఙ్కటశైలపతి నీకు కడువేడుకై వుణ్డె వుయ్యాల ॥