Stotram - Sacred Scripture in telugu

Annamayya Keerthanas Adivo Alladivo

అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో

Annamayya Keerthanas Adivo Alladivo

Stotram
Unknown
0 Verses
110%

అన్నమయ్య కీర్తన అదివో అల్లదివో

శ్లోక 1

రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య)

ఆ: స రి2 మ1 ప ద1 ని2 స

అవ: స ని2 ప మ1 రి2 స

తాలం: ఆది

పల్లవి

అదివో అల్లదివో శ్రీ హరి వాసము

పదివేల శేషుల పడగల మయము ॥ (2.5)

చరణం 1

అదె వేఙ్కటాచల మఖిలోన్నతము

అదివో బ్రహ్మాదుల కపురూపము । (2)

అదివో నిత్యనివాస మఖిల మునులకు

అదె చూడు డదె మొక్కు డానన్దమయము ॥ (1.5)

అదివో అల్లదివో శ్రీ హరి వాసము

పదివేల శేషుల పడగల మయము ॥ (1.5)

చరణం 2

చెఙ్గట నల్లదివో శేషాచలమూ

నిఙ్గి నున్న దేవతల నిజవాసము । (2)

ముఙ్గిట నల్లదివో మూలనున్న ధనము

బఙ్గారు శిఖరాల బహు బ్రహ్మమయము ॥(1.5)

అదివో అల్లదివో శ్రీ హరి వాసము

పదివేల శేషుల పడగల మయము ॥ (1.5)

చరణం 3

కైవల్య పదము వేఙ్కట నగ మదివో

శ్రీ వేఙ్కటపతికి సిరులైనది । (2)

భావిమ్ప సకల సమ్పద రూపమదివో

పావనముల కెల్ల పావన మయమూ ॥ (1.5)

అదివో అల్లదివో శ్రీ హరి వాసము

పదివేల శేషుల పడగల మయము ॥ (2.5)